ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN, Publish Date - May 27 , 2024 | 12:06 AM

ఘర్షణలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

బాపట్ల, మే 26 : ఘర్షణలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం ఆయా పోలీసుస్టేషన్‌ల పరిధిలో పాతనేరస్తులకు, ఇటీవల జరిగిన ఘర్షణలలో పాల్గొన్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా, ఆ తర్వాత జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలలో భాగంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. పోలీసు అధికారుల సూచనలు పెడచెవిన పెట్టి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొన్న, ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఘర్షణలు, ర్యాలీలలో పాల్గొన్నవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పోలీసు అధికారులు పోలీసుస్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే పాతనేరస్తులు, ఘర్షణలకు పాల్పడటానికి అవకాశం ఉన్నవారిపై, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేసినా, ర్యాలీలు, ఊరేగింపులలో పాల్గొన్నా, బాణాసంచా కాల్చినా చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి వివాదాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్ళకుండా సత్‌ప్రవర్తనతో మెలగాలని సూచించారు. పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ యు.శ్రీనివాసులు పాతనేరస్తులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Updated Date - May 27 , 2024 | 12:06 AM

Advertising
Advertising