ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తేమ సాకు.. రైతుకు షాకు

ABN, Publish Date - Nov 26 , 2024 | 01:46 AM

ఆకాశం మేఘావృతమై ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయం... ఆరుగాలం పంచించిన ధాన్యం ఎక్కడ వర్షానికి తడిచిపోయోనన్న ఆందోళనతో యంత్రాలతోనే వరి కోతకు ప్రాధాన్యం ఇస్తున్నారు డెల్టాలోని రైతులు.

నందివెలుగు-కొల్లిపర మద్య చేలల్లో యంత్రాలతో కోతకోసి, ప్లాట్‌ల రోడ్లపై ఆరబోసుకున్న రైతులు

వాతావరణ మార్పులతో రైతుల్లో భయం... భయం

యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమ శాతం 19 నుంచి 21 వరకు

ప్రభుత్వం ఇచ్చిన పరిమితి 17 శాతం

అదనపు తేమ శాతాలు చూపి ఎదురు వసూలు చేస్తున్న మిల్లర్లు

బస్తాకు రూ. 200 నుంచి రూ. 300 కడితేనే ధాన్యం కొనేది!

ప్రభుత్వం నిర్ణయించిన ఽమద్దతు ధర రూ. 1740

బయటి మార్కెట్‌లో ధర రూ. 1300 నుంచి రూ. 1400 వరకు

రెట్టింపు తేమ శాతం వసూలు చేస్తున్నారు

సాధారణంగా తేమ ఉన్న ధాన్యం ఆరబెడితే, ప్రతి పది బస్తాలకు ఒక బస్తా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు ఒక రైతు 100 బస్తాల ధాన్యం మిల్లర్‌కు వేశారనుకుంటే, దీనిలో తేమ వల్ల తరుగు 10 బస్తాలు ఉండొచ్చు. అంటే ప్రభుత్వ ధర ప్రకారం రూ. 17,400 మిల్లర్‌కు నష్టం వచ్చేమాట వాస్తవమే. అయితే 100 బస్తాలకు రూ. 300 చొప్పున ఎదురు వసూలు చేస్తుండటంతో అన్ని బస్తాలపైనా రూ. 30వేలపైనే మిల్లర్‌లకు రైతు ఎదురు కట్టాల్సి వస్తోంది. అంటే దాదాపు రెట్టింపు రేటును తేమ శాతం సాకుగా చూపి రైతు నుంచి ముందే దోచేస్తున్నారు. అదే తేమ శాతాన్ని బట్టి ఒక శ్లాబ్‌ రేటును ప్రబుత్వమే నిర్ణయిస్తే అంత నష్టం ఉడదనేది రైతుల మాట.

ప్రభుత్వమే రేటు నిర్ణయించాలి

ధాన్యం కొనుగోలుకు సంబందించి తేమ శాతం 17 వరకు, మట్టి, రాళ్లు, తాలు గింజల వంటివి ఇతర వ్యర్థాలు 1 శాతం వరకు ఉండొచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. చెడిపోవటం, రంగు మారటం, మొకలు వంటివి ఉన్న ధాన్యమయితే 5 శాతం, పక్వతలేని, ముడుచుకుపోయిన గింజలు 3 శాతం, ఏ గ్రేడ్‌ రకంలో తక్కువ రకం కానీ, కేళీలు 3 శాతం వరకు ఉండొచ్చని సూచించింది. అయితే ప్రస్తుతం తేమ శాతం సమస్యగా మారింది. 17 శాతం లోపు తేమ ఉంటే, ఎ గ్రేడ్‌ రకానికి రూ. 1740 చెల్లిస్తారు. అయితే ఆపై తేమ శాతం ఉన్నవాటికి మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో తేమ ఉన్న ధాన్యాన్ని అమ్మక తప్పదని, ప్రభుత్వ కొనకపోతే చివరకు దళారులకైనా తెగనమ్మక తప్పదని చైతులు చెబుతున్నారు. అయితే 17 శాతానికి మించిన అదనపు శాతాలకు 21 శాతం వరకు ప్రభుత్వమే ధరలో తరుగుదల నిర్ణయిస్తే, మిల్లర్ల దోపిడీ తగ్గుతుందనేది రైతుల విన్నపం.

తెనాలి, నవంబర్‌ 25, (ఆంధ్రజ్యోతి): ఆకాశం మేఘావృతమై ఎప్పుడు వర్షం పడుతుందోనన్న భయం... ఆరుగాలం పంచించిన ధాన్యం ఎక్కడ వర్షానికి తడిచిపోయోనన్న ఆందోళనతో యంత్రాలతోనే వరి కోతకు ప్రాధాన్యం ఇస్తున్నారు డెల్టాలోని రైతులు. అయితే కోత కోసిన ధాన్యాన్ని వెంటనే అమ్మకుండా ఆరబెట్టి, తేమ తగ్గాకే అమ్మకాలు చేస్తారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో రైతులు ఆరబెడితే ఎక్కడ తడిచిపోయి అసలుకే నష్టం వస్తుందన్న భయంతో అమ్మటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వీరి భయాన్ని, వాతావరణ ప్రతికూలతను మిల్లర్లు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. రైతులను నిలవు దోపిడీ చేసేస్తున్నారు.

ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు అనేక మార్గాలను మార్కెటింగ్‌ కోసం ప్రవేశపెడితే, అవేమీ రైతులకు అక్కరకు రావటంలేదు. కృష్ణా డెల్టాలో 2024 ఖరీఫ్‌ పంట వచ్చేసింది. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలో ఉన్న కోతలు మొదలుపెట్టేశారు. అయితే ధాన్యం అమ్ముకోటానికి గతంలోలాగా ఆర్‌ఎస్‌కేల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా వాట్సప్‌లో హాయ్‌ అని పెడితేచాలు... ధాన్యం అమ్మేసుకునేలా మార్పులుకూడా చేశారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఈ తతంగం మొత్తం పూర్తయిన తర్వాత వెళ్లాల్సింది మిల్లర్ల దగ్గరకే కావటంతో వారి దగ్గర దోపిడీకి మాత్రం తెరపడలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

కృష్ణా పశ్చిమ డెల్టా కింద గుంటూరు జిల్లా పరిధిలో 1,84,190 ఎకరాలు, బాపట్ల జిల్లా పరిధిలో 3,79,997 ఎకరాలు, ప్రకాశం జిల్లా పరిధిలో 7,164 ఎకారలలో ఖరీఫ్‌ వరి సాగవుతోంది. వీటిలో ఒక్క ప్రకాశం జిల్లాలో, బాపట్ల జిల్లాలోని తీర మండలాల్లో కొన్నిచోట్ల మినహాయించితే, మిగిలిన విస్తీర్ణం మొత్తం వరి కోతకు సిద్దమైంది. తెనాలి, కొల్లిపర, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు, పొన్నూరు, బాపట్ల జిల్లా పరిధిలో కొల్లూరు, వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు, చెరుకుపల్లి, రేపల్లె, మరికొన్ని మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయి. మనుషులతో కోత కోయించే రైతులు మాత్రం వరుణుడిపై భారం వేసి, కుప్పలు వేసేందుకు వరి ఓదెలను చేలపైనే ఆరేవరకు ఉంచేస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, వరి కోత కోసేందుకు, కుప్పలు వేసేందుకు కూలీలు రేట్లు పెంచేశారు. వీరిపరిస్థితి అటుంచితే, 70 శాతం మంది రైతులు యంత్రాలతోనే కోతకోసి, అమ్మేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తడిచిపోతే తర్వాత రేటు రాదని, పండించిన పంట దక్కకుండా పోతుందనే ఆందోళనతో కోత, కుప్ప, నూర్పిళ్లతో పనిలేకుండా ఒకేసారి వరికోత యంత్రం సాయంతో కోసేసి, ధాన్యం అమ్ముకుంటున్నారు. అయితే యంత్రాల సాయంతో కోత కోసినప్పుడు ధాన్యంలో తేమ శాతం 19 నుంచి 21 వరకు ఉంటోంది. అదే వాతావరణం బాగుంటే తేమ తగ్గేవరకు ఆరబెట్టి అమ్ముకునేవారు. అయితే వరుణుడి గుబులుతో కోత కోయటం ఆలస్యం ధాన్యాన్ని చేను నుంచి దాటించేస్తున్నారు. అయితే ఇక్కడే తేమ శాతాలతో చిక్కు వచ్చిపడింది.

బస్తాకు రూ. 200పైన ఎదురు వసూళ్లు

రైతు పండించిన ధాన్యం అమ్మితే కొన్న వ్యాపారి కానీ, మిల్లర్లు కానీ రైతుకే డబ్బు చెల్లించటం సహజం. అయితే ఇప్పుడు పరిస్థితి దీనికి విరుద్దంగా ఉంది. తాను పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్ముకోవాలంటే ఎదురు డబ్బు కట్టాల్సి వస్తోంది. వరి కోతలు మొదలయిన తరుణంలో ధాన్యం ఽమద్దతు ధరను ప్రభుత్వం 75 కిలోల బస్తా ఎ గ్రేడ్‌ రకానికి రూ. 1740, సాధారణ రకం ధాన్యానికి రూ. 1725గా ధర నిర్ణయించింది. అదే బయట మార్కెట్‌లో అయితే యంత్రాలతో కోసిన ఽధాన్యానికి ఎంత తేమ ఉన్నా బస్తా రూ. 1300 నుంచి రూ. 1400 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభత్వం మద్దతు ధర దీనికి మించి ఉండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలకే అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. అనుకున్నట్టే మార్కెటింగ్‌ శాఖ చూపిన ప్రకారం ధాన్యం అమ్మేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా బాగానే ఉన్నా, తీరా మిల్లర్‌ దగ్గరకు వెళ్లే సరికి రైతుకు సమస్య ఎదురవుతోంది. తేమ 17 శాతంలోపు ఉంటే మాత్రం ఏ ఇబ్బందీ పెట్టటంలేదు. సమస్యంతా తేమ ఎక్కువగా ఉండే ధాన్యానికే. 18 నుంచి 21 శాతం వరకు తేమ ఉంటుండటంతో మిల్లర్లు కొనుగోలు చేయమని చెప్పకుండా, రైతుల నుంచి ముందస్తుగానే వసూళ్లకు దిగుతున్నారు. తేమ శాతం 17 నుంచి 19 శాతం ఉంటే బస్తాకు రూ. 200 చొప్పున, 20 నుంచి 21 శాతం తేమ ఉంటే రూ. 300పైన ఎదరు కట్టాలని రైతుల నుంచి నిలబెట్టి వసూలు చేస్తున్నారని, చెబుతున్నారు.

బస్తాకు రూ. 200 నుంచి రూ. 300 ఎదురు కట్టాల్సి రావటం ఇబ్బదిగా ఉందని, అదే ప్రభుత్వమే రేటులో కోత విధిస్తే, మిల్లర్లకు ఎదురు కట్టే పరిస్థితి ఉండదని, పైగా వారు మద్దతు ధరలో కోతకోసి దోపిడీ చేయకుండా తెరపడుతుందని, రైతులకు మేలు జరుగుతుందనేది రైతుల మాట. 75 కిలోల బస్తాకు ఎంత తేమ ఉంటే ఎంత తరుగుదల ఉంటుందనే అంశాన్ని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో నిర్ణయించి రేటు నిర్ణయిస్తే చాలావరకు మేలు జరుగుతుంది. రైతుల నిలువుదోపిడీ లేకుండా పోతుంది. త్వరలో రైతు సంఘాల నాయకులు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్‌ దగ్గరకు తీసుకువెళ్లాలనే ఆలోచనకు వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై మరోసారి పునరాలోచించాలనేది రైతుల విన్నపం.

Updated Date - Nov 26 , 2024 | 01:46 AM