ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అత్యాచార కేసుల్లో కఠిన శిక్షలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:11 AM

రాష్ట్రంలో గతంలో చోటుచేసుకొన్న పలు అత్యాచార ఘటనలకు సంబంధించి న్యాయస్థానాలు తాజాగా ఇచ్చిన తీర్పుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడ్డాయి.

రెండు కేసుల్లో నిందితులకు 20 ఏళ్లు,

మరో కేసులో 25 ఏళ్ల జైలుశిక్ష

గతంలో గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఘటనలు

గుంటూరు లీగల్‌/రాజవొమ్మంగి, సెప్టెంబరు 20: రాష్ట్రంలో గతంలో చోటుచేసుకొన్న పలు అత్యాచార ఘటనలకు సంబంధించి న్యాయస్థానాలు తాజాగా ఇచ్చిన తీర్పుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడ్డాయి. 2018 జూన్‌ 29న ఓ నర్సింగ్‌ యువతిపై అత్యాచార కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన యాదగిరి శ్రీనివా్‌సకు 20 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ గుంటూరు ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.నీలిమ శుక్రవారం తీర్పు ఇచ్చారు. అదేవిధంగా మైనర్‌ బాలికపై 2018 జూన్‌ 22న జరిగిన అత్యాచారం కేసులో గుంటూరులోని ఏటుకూరు రోడ్డు సుగాలి కాలనీకి చెందిన బాణవతు గోపినాయక్‌, నెహ్రూనగర్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌ రఫీకి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి కె.నీలిమ తీర్పునిచ్చారు. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. 2020 నాటి ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి సంబంధించి నమోదైన మరో పోక్సో కేసులో అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు గ్రామానికి చెందిన నిందితుడు వరహాలబాబుకు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.11 వేల జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్‌ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నర్సింగ్‌ యువతి కేసులో మరో నిందితుడు రాసగిరి రాఘవయ్య కోర్టు విచారణకు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం అతనిపై వారెంట్‌ జారీచేయడంతోపాటు, గతంలో కేసు నుంచి అతన్ని వేరు చేసింది. శ్రీనివా్‌సపై నేరారోపణలు రుజువు కావటంతో న్యాయమూర్తి పె ౖమేరకు తీర్పు వెలువరించగా, రాఘవయ్యపై కేసు పెండింగ్‌లో ఉంది.

Updated Date - Sep 21 , 2024 | 04:12 AM