ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వంద బాదాడు.. వెయ్యి నొక్కాడు!

ABN, Publish Date - Apr 29 , 2024 | 04:42 AM

బటన్‌ నొక్కాను.. బటన్‌ నొక్కాను అంటూ బటన్‌రెడ్డి పదేపదే చెబుతున్నాడు. క్లాస్‌ వార్‌ అంటున్నాడు.. ఏది క్లాస్‌ వార్‌..? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు.

జగన్‌ ఐదేళ్ల పాలన ఇదే: చంద్రబాబు

తాడేపల్లి ప్యాలె్‌సను బద్దలుకొడితే పేదల కడుపు నిండుతుంది

క్లాస్‌వార్‌ అంటే అదీ!.. సీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు

జాబ్‌ కేలెండర్‌ ఇచ్చాడా?.. ఉద్యోగులకు న్యాయం చేశాడా?

జే బ్రాండ్‌తో మహిళల మంగళసూత్రాలు తెంపేస్తున్నాడు

ఆ నవరత్నాలు నవ మోసాలు.. వైసీపీ మేనిఫెస్టో అబద్ధాలపుట్ట

మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు.. మేం రాగానే పింఛన్‌ 4 వేలు

అంగన్‌వాడీ, హోంగార్డులు, పెన్షనర్లందరికీ అండగా ఉంటా

మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.. ఏటా 4 లక్షల ఉద్యోగాలు

స్కిల్‌ పెంచేందుకు యువతకు శిక్షణ.. ఉద్యోగులకు న్యాయం

‘సీమ’ వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు: బాబు

కర్నూలు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘బటన్‌ నొక్కాను.. బటన్‌ నొక్కాను అంటూ బటన్‌రెడ్డి పదేపదే చెబుతున్నాడు. క్లాస్‌ వార్‌ అంటున్నాడు.. ఏది క్లాస్‌ వార్‌..? ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చింది పది రూపాయలు. రూ.వంద బాదేశాడు.. రూ.వెయ్యి నొక్కేశాడు.. తాడేపల్లి ప్యాలె్‌సను బద్దలుకొడితే పేదల కడుపు నిండుతుంది.. క్లాస్‌ వార్‌ అంటే అదీ..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నవరత్నాలు నవమోసాలని.. జగన్‌ ప్రకటించిన మేనిఫెస్టో అంతా అబద్ధాల పుట్టని ధ్వజమెత్తారు. 99.5 శాతం అమలు చేశామంటూ ప్రజలను మోసగిస్తున్నాడని.. మళ్లీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలనూ దగా చేసిన వైసీపీని మే 13న ఓటుతో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు.ప్రజాగళంలో భాగం గా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌ 99.5ు హామీలు అమలు చేశానని చెబుతున్నాడని.. మద్య నిషేధం చేశాడా? జాబ్‌ కేలెండర్‌ ఇచ్చాడా? ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చాడా అని ప్రశ్నించా రు. చివరకు చెత్తపై కూడా పన్నులు వేసిన చెత్త ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే..

..34 మందిని చంపేశావ్‌

జగన్‌..! నీ రాజకీయ పిచ్చి కోసం గత నెలలో వృద్ధుల ను మండుటెండల్లో రోడ్లపైకి తీసుకొచ్చి 34 మంది వృద్ధు లు చనిపోవడానికి కారణమయ్యావ్‌. పేదవారి జీవితాల తో ఆడుకోవద్దు. సీఎస్‌ ఒకటో తేదీనే ఇళ్ల వద్దకే పింఛన్‌ పంపించే ఏర్పాట్లు చేయాలి. పింఛన్‌ పథకం మొదలు పెట్టింది ఎన్టీఆర్‌.. ఆ పింఛన్‌ను. రూ.200 నుంచి ఐదు రెట్లు పెంచి రూ.2 వేలు చేసింది నేను. జూన్‌ 4న ఎన్నిక ల ఫలితాలు వస్తాయి. మన ప్రభుత్వం రాగానే పింఛన్‌ రూ.4 వేలు పెంచి ఏప్రిల్‌ నుంచే ఇస్తాం. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. ఆడబిడ్డలకు నెలనెలా రూ.1,500 చొప్పున ఐదేళ్లలో రూ.95 వేలిస్తాం. తల్లికి వందనం కింద బడిలో చదివే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం. ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే రూ.60 వేలు వస్తుంది. దీపం పథకంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. సైకో ఇచ్చిన ఇంటి స్థలాను రద్దు చేయను. పేదలందరికీ రెండు మూడు సెంట్ల స్థలాలు ఇస్తాను. అందరి కీ ఇళ్లు కట్టిస్తాను. రేషన్‌ పథకంలో మన ప్రభుత్వం 8 రకాల సరుకులు ఇస్తే.. ఈ జగన్‌ కేంద్రం ఉచితంగా ఇస్తు న్న ఐదు కేజీలు బియ్యం మాత్రమే ఇస్తూ తన స్టిక్కర్‌ వేసుకున్నాడు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా సంకల్పం. ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. మారుమూల గ్రామం కౌతాళం, గూ డూరులో కూర్చొని అమెరికా కంపెనీలతో పని చేసే లా తీర్చిదిద్దుతాను. అదీ నా విజన్‌. నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి ఇస్తాను. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.

ముస్లిం రిజర్వేషన్లపై దుష్ప్రచారం

ఎన్డీయే ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని జగన్‌ విష ప్రచారం చేస్తున్నారు. దీని ని నమ్మకండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటా తొలగించం. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నాం. 3 పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేశాయి. ఓడిపోతామనే భయంతో ముస్లింలలో విషబీజం నాటేందుకు జగన్‌ కుట్రలు చేస్తున్నాడు. ఆయన గారడీ మాటలు చెల్లవు. ఉద్యోగులకు జగన్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశాడు. మేం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం.

రతనాల సీమగా రాళ్ల సీమ

రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న కర్నూలు ప్రాంతానికి సాగునీరు ఇస్తే రైతులు మంచి పంటలు పండిస్తారు. పరిశ్రమలు వస్తాయి. రాళ్లసీమ రతనాలసీమగా మారుతుంది. వలసలు ఆగిపోతాయనే దూరదృష్టితో ఆలోచించి నా హయాంలో రూ.1,985 కోట్లతో ఆర్డీఎస్‌ కు డి కాలువ ప్రాజెక్టు, రూ.1,942 కోట్లు మంజూరు చేసి వేదవతి ప్రాజెక్టు చేపట్టాను. గుండ్రేవుల ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారు చేసి నిధులు కూడా ఇచ్చాను. 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇచ్చాను. ఈ జగన్‌ వచ్చి ఏం చేశాడు..? రాయలసీమలో 102 ప్రాజెక్టులను ఆపేసిన దుర్మార్గుడు. కౌతాళం ప్రాంతం నుంచి 80 వేల మంది వలస వెళ్తున్నా రు. వాటి నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తాం. ఈ జలగన్న నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఎక్కడ చూసినా నాసిరకం మద్యమే. భూమ్‌..భూమ్‌.. స్పెషల్‌ స్టేటస్‌.. ప్రెసిడెంట్‌ మెడల్‌ వంటి కంపెనీల మద్యం ఎప్పడైనా చూశారా..? జే బ్రాండ్‌ మద్యంతో ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపేస్తున్నాడు. క్వార్టర్‌ మద్యం ఇప్పడు రూ.200-250 ఉంది. ఆ డబ్బంతా తాడేపల్లి కొంపకు పోతోంది. కాగా, చంద్రబాబు ఆదివారం రాత్రి గూడూరులో బస చేశారు.

పాదయాత్రలో తలలు నిమిరాడు.. ముద్దులు పెట్టాడు.. మీరేమో ఐస్‌లా కరిగిపోయారు. ఆ తర్వాత ఐదేళ్లు బాదుడే బాదుడు. మీ సంపద పెంచాడా..? మీ జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ దుర్మార్గుడికి మళ్లీ ఓటేస్తారా..?

జగన్‌ మాయమాటలు.. గారడీ మాటలకు మళ్లీ మోసపోతే ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. టీడీపీ కూటమిని గెలిపిస్తే పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాలి. అదీ మన విజన్‌.

జూన్‌ 4 తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. సంపద సృష్టించి పేదల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ జగన్‌ను ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి.. అందుకు సిద్ధమా..?

- చంద్రబాబు

Updated Date - Apr 29 , 2024 | 04:43 AM

Advertising
Advertising