ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: మాక్ పోలింగ్ వ్యవహారం.. బాలినేని పిటిషన్‌పై ముగిసిన ఇవాళ్టి విచారణ

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:05 PM

సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

AP High Court

అమరావతి: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈవీఎంలో లోపాలు ఉంటే వెంటనే వీవీ ప్యాట్‌లు, ఈవీఎంలు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయితే అందుకు విరుద్ధంగా విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ మాక్ పోలింగ్ నిర్వహించాలంటూ ఆదేశించడం విరుద్ధమని పిటిషన్‌లో శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. కాగా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని చెప్పిన ఈసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో పిటిషన్‌పై విచారణను హైకోర్ట్ రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.


ఇవాళే మాక్ పోలింగ్..

ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ రోజు (సోమవారం) నుంచి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో అనగా... 6,26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆరు రోజుల పాటు మాక్ పోలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో జరుగనుంది.


ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ (Former Minister Balineni Srinivas)... 12 పోలింగ్ కేంద్రాల్లో వినియోగించిన ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. బాలినేని వినతితో... టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోలింగ్, రీ చెకింగ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఇవాళ (సోమవారం) ఉదయం విచారణ జరపనుంది. హైకోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఉన్నతన్యాయస్థానం తీర్పు వచ్చే వరకు కూడా టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఈసీ కొనసాగించనుంది.

Updated Date - Aug 19 , 2024 | 12:05 PM

Advertising
Advertising
<