ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సహాయ నిధితో ఆదుకోరూ..!

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:22 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు సాయం చేయాలని పలువురు అనారోగ్య బాధితులు ప్రభుత్వాన్ని కోరారు.

టీడీపీ నేతలను వేడుకున్న అనారోగ్య బాధితులు

అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు సాయం చేయాలని పలువురు అనారోగ్య బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తిరుపతికి చెందిన నరసింహయాదవ్‌, పాయకాపురానికి చెందిన తాతినేని రవి తన కుమారుడు నాగసాయికి, విజయవాడకు చెందిన రాంబాబు, బ్రెయిన్‌స్టోక్‌తో బాధపడుతున్న యలమంచిలికి చెందిన చెల్లూరి సత్యయ్యతో పాటు మరికొందరు సీఎంఆర్‌ఎఫ్‌ కింద తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019లో టీడీపీ ప్రభుత్వం నియమించిన కల్యాణ మిత్రలను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని, తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని 50మంది కల్యాణమిత్రలు కోరారు. హైకోర్టులో మాజీ హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు చెప్పినా.. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని మాజీ హోంగార్డులు వాపోయారు. విశాఖలో డ్వాక్రా బజార్‌ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, నరేగా కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇప్పించాలని, ఇంకా అనేక అర్జీలు రాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కేశవ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. కాగా, అర్జీలు సుకున్న నేతలు స్పందించిన తీరుపై బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 06:53 AM

Advertising
Advertising
<