ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హేమాహేమీల డోన్‌!

ABN, Publish Date - May 04 , 2024 | 04:24 AM

డోన్‌.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాక, రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని గెలిపించిన నేల ఇది.

హ్యాట్రిక్‌ కొట్టేందుకు బుగ్గన ఎత్తులు

టీడీపీ జెండా ఎగరేయాలని

కోట్ల వ్యూహాలు

మంత్రిపై సొంత నేతల్లోనే అసంతృప్తి

కోట్లకు కలిసొచ్చే కుటుంబ నేపథ్యం

కలిసిరాని కేఈ, సుబ్బారెడ్డి వర్గాలు

డోన్‌.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాక, రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని గెలిపించిన నేల ఇది.

ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2014, 2019ల్లో ఇక్కడి నుంచే గెలిచారు. మరోసారి బరిలోకి దిగారు. హ్యాట్రిక్‌ కొట్టేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు.

ఆయన్ను మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి తనయుడు, మూడు సార్లు కర్నూలు ఎంపీగా గెలిచి యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఢీకొంటున్నారు.

ఇక్కడ తన గెలుపుతో కుటుంబ ప్రతిష్ఠ ముడిపడి ఉండడంతో కోట్ల విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.

- నంద్యాల, ఆంధ్రజ్యోతి

నియోజకవర్గ స్వరూపం..

మండలాలు: బేతంచర్ల, డోన్‌, ప్యాపిలి

మొత్తం ఓటర్లు : 2,27,351

పురుషులు : 1,11,883

మహిళలు : 1,15,398

ట్రాన్స్‌జెండర్లు : 70

కీలక సామాజిక వర్గాలు..

బోయలు-40 వేలు, తెలుగు వడ్డెర-30వేలు,

యాదవ-16,000, నాయీ బ్రాహ్మణులు-6,500,

ఎస్సీలు-33 వేలు, ముస్లింలు-24 వేలు,

రెడ్లు-12 వేలు, వైశ్యులు-12 వేలు,

బలిజలు-8,500, ఎస్టీలు-6,700,

కమ్మ-5 వేలు.

Updated Date - May 04 , 2024 | 04:25 AM

Advertising
Advertising