సజ్జల భార్గవ్ ‘బెయిల్’ విచారణ వాయిదా
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:16 AM
సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై దాఖలైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు డిసెంబర్ 6కి వాయిదా వేసింది.
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై దాఖలైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు డిసెంబర్ 6కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై పిటిషనర్ల తరఫు వాదనలు శుక్రవారం ముగిశాయి. ప్రాసిక్యూషన్ తరఫు వాదనల కోసం విచారణను డిసెంబర్ 6కి న్యాయమూర్తి వాయిదా వేశారు.
Updated Date - Nov 30 , 2024 | 04:16 AM