ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court : జైళ్లు, పీఎస్‌లలో ఎన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి?

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:33 AM

రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో ఎన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి? పనిచేయని వాటి స్థానంలో కొత్తవి పెట్టడం లేదా మరమ్మతులకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో వేర్వేరుగా

మరమ్మతులకు, కొత్తవి పెట్టడానికి తీసుకున్న చర్యలేంటి?

అఫిడవిట్‌ వేయండి... డీజీపీ, జైళ్ల డీజీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో ఎన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి? పనిచేయని వాటి స్థానంలో కొత్తవి పెట్టడం లేదా మరమ్మతులకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీ, జైళ్ల శాఖ డీజీని హైకోర్టు సోమవారం ఆదేశించింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను డిసెంబరు 23కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేశ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జూలై 15న ఆదేశాలిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలు కాకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి.విష్ణుతేజ వాదనల వినిపిస్తూ... రాష్ట్ర వాప్తంగా ఉన్న 1,001 పోలీస్‌ స్టేషన్లలో 10 వేల సీసీ కెమెరాలు, 81 జైళ్లలో 1,752 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి నిర్వహణ బాధ్యత రెండు ఏజెన్సీలకు అప్పగించామన్నారు. కొవిడ్‌ కారణంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరిగిందని తెలిపారు.

Updated Date - Dec 03 , 2024 | 05:33 AM