గుంటూరు మేయర్ కేసు వివరాలు ఇవ్వండి
ABN, Publish Date - Nov 20 , 2024 | 05:53 AM
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను మనోహర్ నాయుడు అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు కొట్టివేయాలని మనోహర్ నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.
Updated Date - Nov 20 , 2024 | 05:53 AM