ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జస్టిస్‌ దేవీందర్‌ గుప్తాకు హైకోర్టు ఘన నివాళి

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:30 AM

తెలుగు రాష్ట్రాల అవిభాజ్య హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవీందర్‌ గుప్తాకు శుక్రవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది.

అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల అవిభాజ్య హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవీందర్‌ గుప్తాకు శుక్రవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. ఇటీవల మరణించిన ఆయనకు నివాళి అర్పించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో ఇతర న్యాయమూర్తులు మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం... జస్టిస్‌ దేవీందర్‌ అందించిన న్యాయసేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన పలు కీలక తీర్పులు ఇచ్చారని వారు కొనియాడారు. జస్టిస్‌ దేవీందర్‌ గుప్తా ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పసల పొన్నారావు, ప్రభుత్వ న్యాయవాదులు, రిజిస్ట్రార్‌లు, కోర్టు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 03:30 AM