ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagababu: డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 30 , 2024 | 03:38 PM

తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రాజేస్తోంది. లడ్డూలో వాడిన నెయ్యి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ కావడంతో కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హిందూ మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో.. సనాతన ధర్మంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆయనపై కొందరు విమర్శలకు దిగిన నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారని, పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అని ఎద్దేవా చేశారు. ‘‘డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట.. అన్నీ మతాలను అందరూ గౌరవించాలి’’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా హిందూధర్మ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.


ఇవి కూడా చదవండి

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీం ధర్మాసనం

మిథున్ చక్రవర్తికి ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు


పవన్ ఏమన్నారంటే..

సనాతన ధర్మానికి హాని కలిగితే ఎటువంటి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇటీవల హెచ్చరించారు. ‘‘చేతులెత్తి నమస్కరిస్తున్నా.. సనాతన ధర్మానికి హాని జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు’’ అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంలో వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి క్షమాపణలు కోరుతూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం గుడి మెట్ల మార్గాన్ని నీళ్లు పోసి కడిగి శుభ్రం చేశారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై హిందువులందరూ కలిసికట్టుగా మాట్లాడాలి. దీనిపై మౌనం మంచిది కాదు. వైసీపీ వాళ్ల మాటలు మరింత వేదన కలిగిస్తున్నాయి. తప్పును ఒప్పుకోకుండా బుకాయింపులతో కాలక్షేపం చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చితం చేసుకుంటామని చెప్పాలి. అంతేకానీ ఇష్టానుసారం మాట్లాడటమేమిటి? దుర్గగుడిలో వెండిరథం సింహాల ప్రతిమలు మాయమైతే అప్పట్లో వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు నాడు క్రైస్తవులో, మరొకరో చేయలేదు. చేతులకు తాళ్లు కట్టుకుని బొట్టుపెట్టుకునే హిందువులే మాట్లాడారు’’ అన్నారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలే లక్ష్యంగా కొందరు విమర్శలకు దిగుతున్నారు. వారికి సమాధానంగా నాగబాబు ఇవాళ స్పందించారు.

Updated Date - Sep 30 , 2024 | 03:56 PM