గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం: హోం మంత్రి అనిత
ABN, Publish Date - Jun 16 , 2024 | 05:06 AM
సైకో జగన్ పాలనలో అల్లాడిన రాష్ట్రానికి హోంమంత్రి అవడం అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నానని వంగలపూడి అనిత అన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, ఆడపిల్లల వైపు తప్పుగా చూడాలన్నా భయపడే విధంగా లా అండ్ ఆర్డర్ ఉంటుందని తెలిపారు.
పాయకరావుపేట/రూరల్, జూన్ 15: సైకో జగన్ పాలనలో అల్లాడిన రాష్ట్రానికి హోంమంత్రి అవడం అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నానని వంగలపూడి అనిత అన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, ఆడపిల్లల వైపు తప్పుగా చూడాలన్నా భయపడే విధంగా లా అండ్ ఆర్డర్ ఉంటుందని తెలిపారు. శనివారం పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారన్నారు. హోంశాఖ ప్రక్షాళన దిశగా ముందుకు వెళతానని చెప్పారు.
Updated Date - Jun 16 , 2024 | 05:06 AM