ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన ఆస్పత్రుల యాజమాన్యాలు

ABN, Publish Date - May 22 , 2024 | 07:53 PM

ముందుగా ఇచ్చిన నోటీసులు మేరకు ఈ రోజు (బుధవారం) ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను ఆస్పత్రుల యాజమాన్యాలు నిలిపివేశాయి. రోగులను చేర్చుకునేందుకు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆస్పత్రుల యజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సీఈవో చర్చలకు పిలిచారు.

అమరావతి: ముందుగా ఇచ్చిన నోటీసులు మేరకు ఈ రోజు (బుధవారం) ఏపీ వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను ఆస్పత్రుల యాజమాన్యాలు నిలిపివేశాయి. రోగులను చేర్చుకునేందుకు ఆస్పత్రులు నిరాకరించాయి. దీంతో ఆస్పత్రుల యజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సీఈవో చర్చలకు పిలిచారు. బుధవారం సాయంత్రం వరకు ఆరోగ్య శ్రీ ఆసుపత్రులు, ప్రభుత్వానికి మధ్య జరిగినప్పటికీ విఫలమయ్యాయి.


రూ.203 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ట్రస్ట్ సీఈవో చెప్పారు. అయితే తమకు రూ.800 కోట్లు విడుదల చేస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని సంఘాలు స్పష్టం చేశాయి. ఆస్పత్రుల నిర్వహణ తమకు భారంగా ఉందని, అందుకే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి. రూ.800 కోట్లు విడుదల చేసే వరకు తమ సేవలను కొనసాగించలేమని ఆస్పత్రుల యాజమాన్య సంఘం స్పష్టం చేసింది.


దీంతో ప్రభుత్వం, ఆస్పత్రుల యాజమాన్యాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ఆస్పత్రులు సేవలు నిలిపివేస్తే చర్యలు తీసుకుంటానని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. అయితే ట్రస్టు సీఈవో ప్రకటనపై ఆసుపత్రుల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Updated Date - May 22 , 2024 | 07:53 PM

Advertising
Advertising