ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇలా ఉంటే ఎలా?

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:37 PM

ప్రభుత్వ హాస్టల్‌లో పరిశుభ్రత తప్పక పాటించాలని, ఇలా అపరిశుభ్రంగా ఉంటే ఎలా అని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్టల్‌లో భోజనం పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆగ్రహం

ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ తనిఖీ

కోసిగి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ హాస్టల్‌లో పరిశుభ్రత తప్పక పాటించాలని, ఇలా అపరిశుభ్రంగా ఉంటే ఎలా అని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఇంటిగ్రెటెడ్‌ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్‌ వార్డెన కోటేశ్వరయ్య లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌ ఆవరణంలో నిలిచిన మురుగునీటిని పరిశీలించారు. హాస్టల్‌కు మెట్లు సరిగ్గా లేకపోవడంతో ఎలా నడవాలని అధికారులను ప్రశ్నించారు. ప్రతి గదిని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. వంట గదిని, టాయిలెట్స్‌, నీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకులను పరిశీలించారు. హాస్టల్‌లో ఎలాంటి మౌలిక వసతులు లేవని, తాగునీటి సమస్య, సరైన విద్యుత సదుపాయం లేదని, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో చాలా సమస్యలు ఉన్నాయనీ, వాటికి సంబంధించి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మండల అధికారులు వారానికి ఒకసారి పర్యవేక్షించాలని ఆదేశించారు. హాస్టల్‌ ఆవరణంలో మద్యం తాగేవారిపై కేసులు నమోదు చేయాలని ఎస్‌ఐ చంద్రమోహనను సూచించారు. అలాగే హాస్టల్‌ పరిసరాల్లో చెత్తాచెదారం వేయకుండా సమీపంలోని కాలనీవాసులకు నోటీసులు అందించాలని, మలమూత్ర విసర్జనలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం బియ్యం స్ర్టాంగ్‌ రూమ్‌లో ఉంచి రికార్డులు సరిగ్గా చూపకపోవడంతో హాస్టల్లోని ప్రైవేటు వ్యక్తులపై సబ్‌ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట నిర్వాహకులు మెనూ సక్రమంగా పాటించడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ నిత్యానందరాజు, డీటీ రుద్రగౌడు, ఎస్‌ఐ చంద్రమోహన, ఆర్‌ఐ శ్రీరాములు, తదితరులున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:37 PM