ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇలాగైతే ఎలా?

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:02 AM

రాయలసీమ కరువు పల్లెసీమల్లో పరిశ్రమలు పెట్టాలాంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు.

ఆలూరు మండలం మొలగవెళ్లిలో రెన్యూ విండ్‌ పవర్‌ ఆఫీసులో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి తమ్ముడు బుసినె వెంకటేశ, అనుచరులు ధ్వంసం చేసిన ఫర్నీచర్‌

పరిశ్రమలు తరిమేస్తారా..!?

విధ్వంసం సృష్టిస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా..?

విండ్‌ ఎనర్జీ ఆఫీసులపై వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరుల దాడులు

ఫర్నిచర్‌, కంప్యూటర్లు, సీసీ కెమెరాలు ధ్వంసం

గ్రీన ఇనఫ్రా కంపెనీ మేనేజరు, సిబ్బందిపై దాడులు

వైసీపీ ప్రభుత్వంలోనూ తుపాకితో బెదిరింపులు

రాయలసీమ కరువు పల్లెసీమల్లో పరిశ్రమలు పెట్టాలాంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. పరిశ్రమలు రావాలంటే మేమున్నామనే భరోసా ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు అండగా నిలిచినప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్న పరిశ్రమల్లో పని చేసి సిబ్బందిని తొలగించి తనవాళ్లను పెట్టుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యే బసినే విరూపాక్షి సోదరుడు వెంకటేశ, దేవనకొండ జడ్పీటీసీ రామకృష్ణతో పాటు మరో 22 మంది వైసీపీ నాయకులు వెళ్లి వీరంగం సృష్టించాడు. కార్యాలయంలోని ఫర్నిచర్‌, కంప్యూటర్లను నేలకేసి కొట్టి విధ్వంసం సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. ఇలా చేస్తే పరిశ్రమలు వస్తాయా? యువతకు ఉపాధి లభిస్తుందా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలను తరిమేసే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పాణ్యం నియోజకవర్గంలో అప్పటి ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్య అనుచరులు తుపాకి పెట్టి సోలార్‌ పవర్‌ కంపెనీ ప్రతినిధులను భయపెట్టారు. తాజాగా ఆలూరు సంఘటన చూస్తే.. పరిశ్రమల ఏర్పాటులో వైసీపీ నేతలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తోంది.

కర్నూలు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గం అంటే కరువు.. వలసలకు చిరునామాగా నిలుస్తోంది. వానొస్తే పంటలు.. లేదంటే కరువు కాటకాలతో మూటముల్లే సర్దుకొని పిల్లా జల్లాతో సుగ్గిబాటన తరలిపోవాల్సిందే. 1955లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇక్కడి నుంచి 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. నిత్యం కరువు దరువేస్తున్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి చూపాలనే ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. రాష్ట్ర విభజన తరువాత కొలువుదీరిన అప్పటీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం కర్నూలు జిల్లాలో సోలార్‌, విండ్‌ ఎనర్జీ కంపెనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాయలసీమలో సోలార్‌, విండ్‌ పవర్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలంటూ ప్రోత్సహించారు. అందులో భాగంగా ఓర్వకల్లు మండలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వెయ్యి మెగావాట్లా సోలార్‌ పవర్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఆలూరు, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో పవన విద్యుత (విండ్‌ పవర్‌) ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతంగా గుర్తించారు. విండ్‌ పవర్‌ యూనిట్లు ఏర్పాటుకు పలు పరిశ్రమలు ముందుకు వచ్చాయి.

ఫ మందుకొచ్చిన ‘రెన్యూ విండ్‌ ఎనర్జీ’

ఆలూరు నియోజకవర్గంలో 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో విండ్‌ పవర్‌ ఉత్తత్తి చేసేందుకు రెన్యూ విండ్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ముందుకు వచ్చింది. దాదాపు 100-200 మెగావాట్లా పవన విద్యుత లక్ష్యంగా అడుగులు వేసింది. ఆలూరు, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో రైతుల నుంచి భూ సేకరణ చేసి విండ్‌ వపర్‌ గాలి మరల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ 2011లో సుమంత సిన్హా స్థాపించారు. గుజరాత, రాజస్థాన, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ, ఉత్తరప్రదేశ, తమిళనాడు సహా ఆంధ్రప్రదేశలో ఈ కంపెనీ విండ్‌, సోలార్‌ పవర్‌ కంపెనీలు ఉన్నాయి. దేశంలోనే కాకండా విదేశాల్లో కూడా సోలార్‌ పవర్‌ యూనిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 238 విండ్‌, సోలార్‌ కంపెనీలు ఈ సంస్థ సొంతం. ఏటా టర్నోవర్‌ దాదాపు రూ.2,500 కోట్లకు పైగా ఉంటుంది. ఆలూరు ప్రాంతంలో రెన్యూ వాయు ఉర్జ ప్రైవేటు కంపెనీ, సిమెన్స గమేష ఎనర్జీ ప్రైవేటు కంపెనీలు, గ్రీన ఇనఫ్రా కంపెనీలు విండ్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీలు అన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చినవే. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోగా.. ఉన్న పరిశ్రమలనే తరిమేశారు. తాజాగా చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో విండ్‌ పవర్‌ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. పారిశ్రామికవేత్తలను ప్రొత్సాహించాల్సిన ఎమ్మెల్యే అనుచరులే దాడులు చేయడం విమర్శలకు తావిస్తోంది.

ఫ పిలిస్తే రాలేదని దాడులు!

విండ్‌ ఎనర్జీ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిని తొలగించి తనవాళ్లను పెట్టుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావడం.. మాట వినలేదని ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు బీభత్సం సృష్టించి విధ్వంసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలూరు, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో విండ్‌ పవర్‌ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులు, ఇతర విభాగాల్లో పని చేయడానికి ఆయా కంపెనీలుషిర్డీసాయి ఏజెన్సీ ద్వారా దాదాపు 70 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏజెన్సీ ద్వారా నియమించిన సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది మెజార్టీగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచించిన వాళ్లనే నియమించారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్నారు. సహజంగా ప్రైవేటు ఏజెన్సీలు అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. గత ప్రభుత్వంలో ఉన్న జయరాం ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచిన బసినే విరూపాక్షి ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే. తాను పిలిస్తే కంపెనీలు ప్రతినిధులు రాలేదని.. ఏకంగా ఆయన స్వయాన సోదరుడు బసినే వెంకటేశ 23 మంది అనుచరులను వెంటేసుకొని.. విండ్‌ పవర్‌ కంపెనీ ఆఫీసులు, సబ్‌ స్టేషన్లపై దాడులు చేశారు.

ఫ గతంలోనూ ఇంతే..

గడివేముల మండలానికి చెందిన వైసీపీ నాయకులు కొందరు 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే గని ప్రాంతంలోని సోలార్‌ పవర్‌ ఉత్పత్తి కంపెనీలపై దాడులు చేశారు. సోలార్‌ ప్లేట్లు శుభ్రం చేసే కాంట్రాక్ట్‌ తమకే ఇవ్వాలంటూ అప్పటి పాణ్యం నియోజవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు సోలార్‌ కంపెనీ యాజమానుల టేబుల్‌పై గన పెట్టి బెరింపులకు గురి చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాణ్యం మండలంలో ఓ సిమెంట్‌ పరిశ్రమలో పని చేసే ఉద్యోగులను తొలగించి తన మనుషులనే పెట్టుకోవాలని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఓ కీలక నాయకుడు బెదిరించాడని ప్రచారం జరిగింది. బనగానపల్లె నియోజకవర్గంలో ఓ సిమెంట్‌ పరిశ్రమ యజమానిని గత వైసీపీ ప్రభుత్వంలో ఓ కీలక ప్రజాప్రతినిధి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఓర్వకల్లులో గత టీడీపీ ప్రభుత్వంలో స్థాపించిన ఉక్కు పరిశ్రమల్లో.. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులు కాంట్రాక్టరును బెదించి ఇక్కడి నుంచి పంపేశారనే ఆరోపణలు లేకపోలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకపోగా.. టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమల్లో తనవాళ్లను చేర్పించాలని, కాంట్రాక్టర్లు తమకే ఇవ్వాలంటూ బెదిరింపులకు గురి చేశారు.

Updated Date - Oct 04 , 2024 | 12:02 AM