ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతమెలా?

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:10 AM

‘ప్రజాప్రతినిధులపై నమోదయిన క్రిమినల్‌ కేసుల విచారణ విజయవాడలోని ప్రత్యేక కోర్టులో నడుస్తున్నాయి. పలు కేసుల విచారణపై హైకోర్టు స్టే విధించింది.

పరిష్కారంతో రండి.. సర్కారుకు హైకోర్టు ఆదేశం

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘ప్రజాప్రతినిధులపై నమోదయిన క్రిమినల్‌ కేసుల విచారణ విజయవాడలోని ప్రత్యేక కోర్టులో నడుస్తున్నాయి. పలు కేసుల విచారణపై హైకోర్టు స్టే విధించింది. వాటి విచారణల్లో వేగం పెంచేందుకు పరిష్కార మార్గాలను కోర్టు ముందు ఉంచం డి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేశ్‌ రెడ్డి, జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజాప్రతినిధులుపై నమోదైన కేసుల విచారణల్లో వేగం పెంచేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సుమోటో పిల్‌ నమోదు చేసింది. పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. ప్రత్యేక కోర్టు తరఫున న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ... మొ త్తం 78 కేసుల విచారణ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంద ని ప్రత్యేక కోర్టు నివేదిక సమర్పించిందన్నారు. ఈ వివరా లు పరిశీలించిన ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల ను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణకు సూచించింది.

Updated Date - Oct 22 , 2024 | 04:11 AM