హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త అమరావతిలోనే!
ABN, Publish Date - Nov 14 , 2024 | 04:46 AM
రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్త కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి హైకోర్టుకు నివేదించారు.
కార్యాలయాల ఏర్పాటుపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
సూత్రప్రాయంగా నిర్ణయం.. చట్టసవరణ చేయాల్సి ఉందని వెల్లడి
పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలుకు ధర్మాసనం ఆదేశం
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్త కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ఇందుకు సంబంధించి చట్టసవరణ చేసి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో పిల్ వేశారు. హెచ్‌ఆర్‌సీలో సిబ్బంది నియామకంతోపాటు ఫిర్యాదుల స్వీకరణకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ మరో పిల్ వేసింది. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు డీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌బాబు, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న జస్టిస్ సిటీలో అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సంబంధిత సంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఎస్‌జీపీ స్పందిస్తూ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని ధర్మాసనానికి నివేదించారు.
హెచ్‌ఆర్‌సీలో నియామకాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?
హెచ్‌ఆర్‌సీ చైర్మన్, ఇతర సభ్యుల నియామకం విషయంలో తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీహెచ్‌ఆర్‌సీకి చైర్మన్‌తోపాటు ఇతర సభ్యులను నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం బుధవారం ఇదే ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ ఏడాది మార్చి 15న నామినేషన్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, తర్వాత ఎలాంటి పురోగతీ లేదని తెలిపారు. దీనిపై ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ... చైర్మన్, సభ్యుల నియామకానికి తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి చెప్పామని, త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 04:47 AM