ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హామీలను నెరవేర్చకుంటే కూటమికి వైసీపీకి పట్టిన గతే: గఫూర్‌

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:09 AM

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ అన్నారు.

అనంతపురం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ అన్నారు. హామీలను నెరవేర్చకపోతే వైసీపీకి పట్టిన గతే కూటమికీ పడుతుందని అన్నారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రజానీకానికి తాగు, సాగు నీరు అందించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సీపీఎం అనంతపురం జిల్లా కమిటీ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పాలకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అత్యంత కరువు జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు సాగు నీటిని సరఫరా చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. ఉమ్మడి అనంతను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 03:10 AM