ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యురేనియం తవ్వితే ఊరుకోం

ABN, Publish Date - Dec 04 , 2024 | 11:39 PM

యురేనియం తవ్వకాలు జరిపితే ఊరుకోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

సభలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ

ప్రజారోగ్యంతో ప్రభుత్వాలు చెలగాటం

విష వాయువులు ప్రబలితే పర్యావరణం, పంటలు ధ్వంసం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్యాపిలి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): యురేనియం తవ్వకాలు జరిపితే ఊరుకోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ బుధవారం మండలంలోని జక్కసానికుంట్ల గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిర్వహించిన సభలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో దాదాపు 40దేశాలు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యురేనియం తవ్వకాలను నిషేధించాయని, అయినా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం యురేనియం తవ్వకాలకు గ్రీనసిగ్నల్‌ ఇవ్వడం బాధాకరమని అన్నారు. మొన్న కర్నూలు జిల్లాలోని కప్పట్రాళలో సీపీఐ ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలను అడ్డుకున్న తర్వాత ఇప్పుడు ప్యాపిలి మండలంలోని జక్కసానికుంట్ల, రాంపురం, మామిళ్లపల్లి గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించడం బాధాకరమన్నారు. పచ్చని పల్లేసీమల్లో యురేనియం తవ్వకాలు జరిపితే ప్రజారోగ్యం, పర్యావరణం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఈ టెండర్లను రద్దు చేయకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని, ప్రజలు ఆందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, రామాంజనేయులు, లేనీనబాబు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, కే రాధాక్రిష్ణ, వెంకటేష్‌, మోటారాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2024 | 11:39 PM