జగన్ ఇలాకాలో జనం రివర్స్
ABN, Publish Date - Mar 28 , 2024 | 04:21 AM
ఇన్నాళ్లూ జనానికి దూరంగా, పరదాల చాటున తిరిగిన సీఎం జగన్, ఎన్నికల వేళ ‘మేమంతా సిద్ధం’ అంటూ 21 రోజులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.
‘మేమంతా సిద్ధం’ అంటూ జగన్
మేం సిద్ధంగా లేం’ అని తేల్చేసిన జనం
1.50 లక్షలమందితో సభ అంటూ ఆర్భాటం
ప్రొద్దుటూరుకు వచ్చింది 30 వేలలోపే
ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలు
బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక నుంచే అభివాదం
యాత్ర దారిలో కనిపించని ప్రజా స్పందన
కడప, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ జనానికి దూరంగా, పరదాల చాటున తిరిగిన సీఎం జగన్, ఎన్నికల వేళ ‘మేమంతా సిద్ధం’ అంటూ 21 రోజులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే, ‘మేం సిద్ధంగా లేం’ అని సొంత జిల్లా కడపలో తొలిరోజే జనం తేల్చిచెప్పారు. జగన్ బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టరు లో ఇడుపులపాయకు వచ్చారు. అక్కడ తండ్రి వైఎస్ ఘాట్ వద్ద ఆయన ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం 1.45కు ఇడుపులపాయ నుంచి బస్సులో జగన్ బయల్దేరారు. వీరన్నగట్టుపల్లె మీదుగా వేంపల్లె చేరుకున్నారు. అప్పటికే సొంత జిల్లా నుంచేకాకుండా, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి కూడా వైసీపీ కార్యకర్త లు వచ్చారు. వేంపల్లెలో కార్యకర్తలు సందడి చేశారు. అయితే బైపాస్ నుంచి వీఎన్‌పల్లె మీదుగా వచ్చేసరికి బస్సుయాత్రలో జనం ఖా ళీ అయ్యారు. వీఎన్‌పల్లె మీదుగా ఎర్రగుంట్ల, పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు చేరుకున్నా రు. కాన్వాయ్‌లో వాహనాలు తప్ప జనం పెద్ద గా కనబడలేదు. జగన్ వేంపల్లె, ఎర్రగుంట్లలో మాత్రం బస్సుపైకి ఎక్కి జనానికి అభివాదం చేశారు. ఇతర చోట్ల అంతా బస్సులోంచే ప్రజలకు అభివాదం చేశారు. 6.40కి జగన్ ప్రొద్దుటూరు సభా ప్రాంగణానికి వచ్చారు. అప్పటికే జనం జంప్. 6.45కు జగన్ ప్రసంగం ప్రారంభించి 7.52కు ముగించారు. జగన్ ప్రసంగం ప్రారంభించిన పది నిమిషాలకే జనాలు వెళ్లిపోవడంతో బారికేడ్లు ఖాళీ అయ్యాయి. చుట్టూ పరదాలు కట్టి జనం బయటికి పోకుండాపెట్టారు. అక్కడికీ జనాలు బయటికి వచ్చేశారు.
ఎందుకీ పరిస్థితి?
జగన్ 2019 వరకు సొంత అడ్డాలో కింగ్. ఆయన జిల్లాకు ఎప్పుడు వచ్చినా జనం, కార్యకర్తలు ఎగబడేవారు. ఆయన సీఎం అయిన తరువాత.. సొంత నియోజకవర్గ జనానికే ము ఖం చాటేస్తూ వచ్చారు. వైఎస్ జయంతి, వర్ధంతి, క్రిస్మస్‌లకు తప్ప జిల్లాకు రావడం లే దు. బహిరంగసభలో మాత్రమే పాల్గొని బారికేడ్ల మధ్య జనాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి 58 నెలలుగా జనాలు అలవాటుపడ్డారు. ఈ ప్రభావం జగన్ ‘మేమంతా సిద్ధం..’ బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది. ప్రారంభం బాగానే ఉన్నా ముగింపులో మాత్రం జగన్‌కు ఊహించని విధంగా జనం షాకిచ్చారు.
ప్రొద్దుటూరు సభను తొలుత లక్ష మందితో నిర్వహిస్తామంటూ డంబాలు పలికి.. ఒకటిన్న ర లక్ష జనం వచ్చారంటూ వైసీపీ నేతలు జబ్బలు చరుచుకున్నారు. తొలి సభను కడప ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలంతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కడప జిల్లా నుంచి 90 ఆర్టీసీ బస్సుల తో పాటు పొరుగున ఉన్న చిత్తూరు, అన్నమ య్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి భారీగా బస్సులను తీసుకువచ్చారు. తిరుపతి జిల్లా నుంచి తిరుమల వెళ్లే బస్సులను కూడా తీసుకువచ్చారు. ఇలా దాదాపు 400కు పైగా బస్సులను తీసుకువచ్చారు. సొంత జిల్లాలో జనం నుంచి అనుకున్నంత స్పందన లేకపోవడంతో పొరుగు జిల్లా ల నుంచి కూడా జనాన్ని తరలించారు. ప్రొద్దుటూరులో జరిగిన జగన్ తొలిసభపై రాష్ట్రమం తా చాలా ఆసక్తి చూపింది. సొంత జిల్లా కావడంతో భారీగా జనాలు వస్తారని అనుకున్నా రు. దీనికి తోడు ఇది వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన తొలి ఎన్నికల సభ. అయితే అంత సీన్ లేదని తేలిపోయింది. మధ్యాహ్నం 4గంటలకు మీటింగ్ అని చెప్పి కడప నుంచి బస్సులను 2గంటల నుంచి తీసుకురావడం మొదలుపెట్టారు. కొన్ని బస్సుల్లో పది మంది కూడా జనాలు లేరు.
అక్కడే ‘సిట్టింగ్’
జనాన్ని తరలించేందుకు క్వార్టర్ మందు, భోజనం, రూ.200 ఇచ్చి బస్సుల్లో తీసుకొచ్చార ని అంటున్నారు. అలా వచ్చిన వారిలో కొంద రు సభా స్థలం పక్కనే కూర్చుని మద్యం తాగుతూ కనిపించారు. డ్వాక్రా మహిళలకు కూడా డబ్బు ఇచ్చి మీటింగ్‌కు తరలించారని సమాచారం.
అదే ఏడుపు
సొంత జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార సభలో జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అయితే ఎంత సేపూ ఒకటే ఏడుపు. మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పడం... కొన్ని పత్రికలు, మీడియాతో ఏడుపులు. ‘మీ బిడ్డ మీకోసం 130 సార్లు బటన్ నొక్కా’డంటూ జగన్ చెప్పుకొచ్చారు. అయితే విద్యాదీవెన, ఇతర బటన్ నొక్కుడు నిధులు ఇంతవరకు పడ లేదంటూ సభకు హాజరైన జనం గుసగుసలు పోయారు.
Updated Date - Mar 28 , 2024 | 04:21 AM