ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి

ABN, Publish Date - Sep 05 , 2024 | 03:19 AM

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముం దస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో అరెస్టులు, గాలింపులు మొదలయ్యాయి.

నిందితుల్లో అప్పిరెడ్డి, తలశిల, నందిగం సురేశ్‌, దేవినేని అవినాశ్‌

విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త అరెస్టు!?

గుంటూరు/విజయవాడ/తుళ్లూరు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముం దస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో అరెస్టులు, గాలింపులు మొదలయ్యాయి. ఈ కేసులో నిందితుడైన విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్త శ్రీనివాస రెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఇక... వైసీపీ కీలక నేతలు, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, నిందితులకోసం గాలింపు మొదలుపెట్టారు. రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం గ్రామంలో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఒక హత్య కేసులోనూ నందిగం సురేశ్‌ ప్రమేయం ఉందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది. ఇక ఇదే కేసు లో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘు రాం, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ కూడా నిందితులుగా ఉన్నారు. వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

మరో 68 మంది పిటిషన్‌పై రేపు తీర్పు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ మరో 68 మంది నిందితులు గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే కోర్టు ఇరువర్గాల వాదనలను వినింది. గురువారం తీర్పు వెలువరించనుంది.

నేటికీ ఆచూకీలేని ప్రధాన నిందితుడు

టీడీపీ ప్రధాన కార్యాలయంలో కీలక నిందితుడు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు పానుగంటి చైతన్య ఆచూకీని ఇప్పటిదాకా పోలీసులు గుర్తించలేకపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Updated Date - Sep 05 , 2024 | 07:54 AM

Advertising
Advertising