ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటి?

ABN, Publish Date - Sep 27 , 2024 | 05:40 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుమల వెళ్తున్నారు! లడ్డూ వివాదం నేపథ్యంలో... కేవలం రాజకీయ పంతం కోసం కొండపై కాలు పెడుతున్నారు! వెంకన్న సన్నిధిలో మరో వివాదం సృష్టించేందుకే ఈ పర్యటన పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్‌ కుటుంబం

జగన్‌పై పెరుగుతున్న ఒత్తిడి!

ఆలయ నిబంధనలపైనా భేషజాలేనా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుమల వెళ్తున్నారు! లడ్డూ వివాదం నేపథ్యంలో... కేవలం రాజకీయ పంతం కోసం కొండపై కాలు పెడుతున్నారు! వెంకన్న సన్నిధిలో మరో వివాదం సృష్టించేందుకే ఈ పర్యటన పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్‌ కుటుంబం క్రైస్తవ మత సంప్రదాయాలనే అనుసరిస్తుంది. నిబంధనల ప్రకారం అన్యమతస్థులు తిరుమల దర్శనానికి వస్తే... వెంకటేశ్వరుడిపై తమకు విశ్వాసముందంటూ డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ జగన్‌ బేఖాతరు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని తన ‘అధికారం’తో తోసిరాజన్నారు. ఇప్పుడు మళ్లీ ‘డిక్లరేషన్‌’ అంశం తెరపైకి వచ్చింది. జగన్‌ సంతకం చేయాల్సిందేనని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పోటీ కోసమే పర్యటన...

లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా చేశారని.. జగన్‌ హయాంలో ఆ కాంట్రాక్టు ఇచ్చారని వెల్లడవడంతో ఇప్పటికే భక్త కోటి తీవ్ర ఆగ్రహంతో ఉంది. అసలీ అంశాన్ని తెరపైకి తెచ్చి సీఎం చంద్రబాబే పాపం చేశారని ఎదురుదాడికి దిగిన జగన్‌.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. తాను కూడా తిరుమల పర్యటన తలపెట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు హిందూసంఘాలు, స్వామీజీలు సమాయత్తమవుతున్నారు. సహజంగా సమాజంలోని ఏదైనా వర్గం నుంచి, మరీ ముఖ్యంగా ఆలయ సంప్రదాయాలకు సంబంధించి ఏవైనా డిమాండ్లు వస్తే రాజకీయ నేతలు సానుకూలంగా స్పందిస్తుంటారు. 2009లో జగన్‌ తిరుమల వెళ్లినప్పుడు వేంకటేశ్వరస్వామిపై భక్తివిశ్వాసాలు ఉన్నాయంటూ సంతకం చేశారు. అధికారంలో కొనసాగిన ఐదేళ్లలో అలాంటి డిక్లరేషన్‌ ఇవ్వలేదు. పైగా తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకూ సతీసమేతంగా వెళ్లలేదు. ఎన్నికల ముందు తాడేపల్లి ప్యాలె్‌సలోనే ‘ఆలయం సెట్టింగ్‌’ వేసి, భక్తిరసం ప్రదర్శించారు. ఇప్పుడు... లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వెళ్తున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం ఆయన డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటని ఆయా సంఘాలతో పాటు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

ఇవ్వడమే సమంజసం...

జగన్‌ తల్లి విజయలక్ష్మి గతంలో ఎన్నికల ప్రచారంలోను, విడిగా బైబిల్‌ పట్టుకుని తిరిగేవారు. జగన్‌, ఆ యన భార్య భారతీరెడ్డి సహా కుటుంబం వైఎస్‌ జయంతి, వర్ధంతి సందర్భంగా వైఎస్‌ సమాధి వద్ద క్రైస్తవ మతానుసారం ప్రార్థనలు చేస్తారు. పులివెందుల చర్చికీ వెళ్తారు. పాస్టర్ల నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. వైఎస్‌ కుటుంబం క్రైస్తవాన్నే పాటిస్తోంది. అం టే... తిరుమల నిబంధనల ప్రకారం, వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లేముందు జగన్‌ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే. సున్నితమైన అంశంపై జగన్‌ సానుకూలంగా స్పందిస్తే సమస్యే ఉండదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీతో పాటు పలువురు ఇతర దేశాల నేతలు కూడా డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాతే వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ విషయంలో వారెవరూ భేషజాలకు పోలేదు.

సీఎం హోదాలో జగన్‌ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ... ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హిందువుల మత విశ్వాసాలను జగన్‌ ఏమాత్రం లెక్కచేయలేదనే విమర్శలున్నాయి.

బ్రహ్మోత్సవాల సమయంలో సీఎంగా ఉన్న నేత సతీసమేతంగా తిరుమలకు వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. సీఎంగా ఉన్న ఐదేళ్లలో జగన్‌ ఎన్నడూ ఈ సంప్రదాయాన్ని పాటించలేదు. ఆయన ఒక్కరే తిరుమలకు వెళ్లారు!


జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకోవడం టీటీడీ అధికారుల బాధ్యత

ఇస్తారో లేదో ఆయన విచక్షణకు వదిలేయాలి

దీనిపై కూటమి పార్టీలు మాట్లాడక్కర్లేదు: పవన్‌

అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘తిరుమల యాత్రకు వెళ్తున్న వైఎస్‌ జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత. ఈ విషయంపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్‌ ఇస్తారా.. లేదా? ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా అనేది వెళ్లే వ్యక్తి విచక్షణకు వదిలేయాలి’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు. తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారమన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నవారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలని సూచించారు. తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని, వారిని నియమించిన వాళ్లు కూడా ఇందుకు బాధ్యలేనని ఓ ప్రకటనలో తెలిపారు. ‘తిరుమ ల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్‌ మతా న్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడాల్సిన సమయం ఇది కాదు. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దు. తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నది నాటి చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరెడ్డే. ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్న ధర్మారెడ్డి కూడా బాధ్యత వహించాలి. తిరుమల అపవిత్రంపై తొలుత ఈ ముగ్గురూ సమాధానం చెప్పాలి. ఆపై శిక్ష అనేది స్వామి చూసుకుంటాడు. వైసీపీ కోరుకుంటున్న గొడవలు మనం ఇవ్వవద్దు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనల్లో ఉన్న వైసీపీ వ్యవహార శైలి పట్ల పోలీసు శాఖ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 27 , 2024 | 07:48 AM