ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కడియం కుర్రాడితో టాటాకు అనుబంధం

ABN, Publish Date - Oct 11 , 2024 | 05:14 AM

పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన మార్గాని శేషు అనే పాతికేళ్ల కుర్రాడితో ఎంతో అనుబంధం ఉంది.

  • ఏడేళ్లుగా ఇద్దరి మధ్య పరిచయం.. మూడుసార్లు కలిసిన యువకుడు

కడియం, అక్టోబరు 10: పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన మార్గాని శేషు అనే పాతికేళ్ల కుర్రాడితో ఎంతో అనుబంధం ఉంది. టాటాకు ఉండే విభిన్న అభిరుచులకు దగ్గరగా ఉండే ఈ కుర్రాడు ఆయనకు ఇష్టమైన వ్యక్తి అయ్యాడు. సందేశాలు, ఈమెయిల్‌లు పంపుతూ ఏడేళ్లుగా పరిచయం పెంచుకున్నాడు. కడియంకు చెందిన గౌతమీ నర్సరీ రైతు మార్గాని శేషు ఎంబీఏ చదువుతున్న సమయంలో రతన్‌ టాటా అభిరుచులపై ఆరా తీశాడు. మొక్కలతో పాటు పశుపక్ష్యాదులపై అభిమానం చూపుతారని తెలుసుకున్నాడు. దీంతో టాటా అభిరుచులకు అనుగుణంగా 2017 నుంచి ఆయన వ్యక్తిగత ఈమెయిల్‌కు పలు కొటేషన్లు పంపేవాడు.

కొన్ని బాగుండటంతో వాటిని వ్యక్తిగత కార్యదర్శులు రతన్‌టాటాకు చూపేవారు. మరింత ఆకట్టుకునేలా శేషు మరిన్ని బొమ్మలు వేయించి పంపేవారు. అవి రతన్‌టాటాకు అమితంగా నచ్చేవి. స్వయంగా శేషు పంపే సందేశాలు, బొమ్మలు చూసేవారు. 2019లో రతన్‌టాటాను కలవాలనే శేషు కోరిక తొలిసారి నెరవేరింది. తన పుట్టినరోజున ఆయన ఆశీస్సులు తీసుకునే అవకాశం లభించింది. డ్రైఫ్రూట్‌ లడ్డూ అంటే ఇష్టమని అమ్మతో తయారు చేయించి తీసుకెళ్లడంతో వాటిని ఆయన తిని బాగున్నాయని మెసేజ్‌ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని శేషు చెప్పారు. తన తల్లిదండ్రులు వీరబాబు, సత్యలకు 2022 జూన్‌లో టాటాను కలిసే అవకాశం లభించిందని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో టాటాను తాను మరోసారి కలిసినపుడు ఆరోగ్యంగా ఉన్నారని, ఇంతలో మరణవార్త వినడం ఎంతో బాధను కలిగించిందని శేషు విచారం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 11 , 2024 | 05:14 AM