ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీసిటీ తరహాలో ఇండస్ర్టియల్‌ జోన్ల అభివృద్ధి

ABN, Publish Date - Aug 04 , 2024 | 05:36 AM

రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్‌ జోన్లను శ్రీసిటీ తరహాలో అభివృద్ధి చేయాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను

అధికారులతో పరిశ్రమల మంత్రి భరత్‌ సమీక్ష

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్‌ జోన్లను శ్రీసిటీ తరహాలో అభివృద్ధి చేయాలని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఇండస్ట్రియల్‌ జోన్లలో నెలకొన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడంతోపాటు వాటన్నింటిలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సీఎం చంద్రబాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌తో పారిశ్రామికవేత్తలకు ఇప్పటికే పాజిటివ్‌ సంకేతాలు వెళ్లాయని, ఫలితంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమలశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్‌ జోన్ల ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం రోడ్‌మ్యాప్‌

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి కనబరుస్తున్నారని, వారి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని రంగాల్లో వ్యాపారులకు మద్దతుగా నూతన పారిశ్రామిక విధానంతో ముందుకు రావాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) కోరింది. పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. మంత్రి టీజీ భరత్‌, ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ను కలిసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ (2024-29)ను అందించింది.

Updated Date - Aug 04 , 2024 | 05:36 AM

Advertising
Advertising
<