ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘పదోన్నతుల్లో అన్యాయం’

ABN, Publish Date - Dec 15 , 2024 | 12:00 AM

రెండు దశాబ్దాలుగా పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్స్‌, డైట్‌ లెక్చరర్స్‌, ఎంఈవో, ఉపవిద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారుల పదోన్నతుల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆత్మగౌరవ సాధన సమితి నాయకులు ఓంకార్‌ యాదవ్‌ తెలిపారు.

ఆత్మగౌరవ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న ప్రధానోపాధ్యాయులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాలుగా పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్స్‌, డైట్‌ లెక్చరర్స్‌, ఎంఈవో, ఉపవిద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారుల పదోన్నతుల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆత్మగౌరవ సాధన సమితి నాయకులు ఓంకార్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం స్థానిక జిల్లా పరిషత ప్రాంగణంలోని ఎంపీపీ హాలులో ప్రధానోపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓంకార్‌ యాదవ్‌ మాట్లాడుతూ విద్యాశాఖలో 95 శాతం మంది పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు ఉన్నత అర్హతలు, సర్వీసు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి పదోన్నతి లేకుండా దీర్ఘకాలంగా పని చేస్తూ అదే క్యాడర్‌లో పదవీ విరమణ పొందుతున్నారన్నారు. అతి తక్కువ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ మేనేజ్మెంట్‌ ఉపాధ్యాయులకు తక్కువ సర్వీసు ఉన్నప్పటికీ ఉన్నత పదవులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ, ప్రధానోపాధ్యాయులు గోవిందరెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు గోకారి, జనార్దన, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి నవీన పాటి, ఆపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌, ఏపీటీఎఫ్‌ (257) అధ్యక్షులు రంగన్న, డీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు రత్నంఏసేపు, పీడీ అసోసియేషన డైరెక్టర్‌ లక్ష్మయ్య, ఆర్‌యుపీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రుడు, ప్రధానోపాధ్యాయులు మధుసూదన శర్మ ఏపీటీఎఫ్‌ నాయకులు ఇస్మాయిలు, మరియానందం పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:00 AM