ప్రణాళిక శాఖలో అక్రమాలు
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:04 AM
నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో అక్రమలు చోటుచేసుకున్నాయి.
పైసలు లేనిదే అనుమతులు లేవు
అధికారులు, సిబ్బందిపై సీఎంఓకు ఫిర్యాదు
అధికారుల గుండెల్లో గుబులు
ప్లానింగ్ సెక్రటరీలను ప్రశ్నించిన కమిటీ బృందం
కర్నూలు న్యూసిటీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో అక్రమలు చోటుచేసుకున్నాయి. గతంలో ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన అధికారులు, ప్లానింగ్ సెక్రటరీలు అవినీతికి పాల్పడ్డారని ఓ వ్యక్తి సీఎంఓకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆ అధికారులు, సిబ్బందిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణను ఆదేశించారు. ఈ క్రమంలో మంత్రి ఓ కమిటీని నియమించారు. ఇందులో రీజినల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిసే్ట్రషన విశ్వనాథ్, రీజినల్ డైరెక్టర్ టౌన ప్లానింగ్ సంజీవ్‌కుమార్ కమిటీలో ఉన్నారు. మంగళవారం నగర పాలక కార్యాలయంలో సంబంధిత ప్లానింగ్ సెక్రటరీలను కమిటీ బృందం విచారించారు.
ఫ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.
ప్రధానంగా డిప్యూటీ సిటీ ప్లానర్ సంధ్యారాణి అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధిత వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. సంధ్యారాణి భర్త బీఎండీ రఫిక్ 55వ సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖానకు సన్నిహితంగా ఉంటూ భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా సంధ్యారాణి మంగళగిరి డైరెక్టర్ అండ్ టౌన ప్లానింగ్ కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ షభ్నమ్ శాసి్త్రతో సన్నిహితంగా ఉంటూ భారీ మొత్తంలో ముడుపులు పంపించారనే విమర్శలు ఉన్నాయి. డీసీసీతో పాటు ప్లానింగ్ సెక్రటరీలో వి.దివ్య(బుదవారపేట 33వ సచివాలయం) ఎన.రూప(డాక్టర్స్ కాలనీ 54వ సచివాలయం) ఎం.రంగనాథ్(హౌసింగ్‌బోర్డు 55వ సచివాయలంలో) విధులు నిర్వహిస్తున్న వీరంతా సంధ్యారాణి ఆదేశాల మేరకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల నందికొట్కూరుకు బదిలీ అయిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ రంగస్వామి, అనంతపురానికి బదిలీ అయిన ఏసీపీ మంజులమ్మ, డోనకు బదిలీ అయిన శబరీష్‌లపై ఆరోపణలు ఉన్నాయి. వీరందరిపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణల మీద నగర పాలక కార్యాలయంలో విచారణ చేపట్టారు.
Updated Date - Nov 13 , 2024 | 12:04 AM