ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కోడ్‌ ఉల్లంఘన కాదా?

ABN, Publish Date - Apr 22 , 2024 | 02:47 AM

ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపునకు ఓ విధానం ఉంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ముందు వచ్చిన వారికి సీనియారిటీ ప్రాతిపదికన సీఎ్‌ఫఎమ్‌ఎ్‌సలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపునకు ఓ విధానం ఉంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ముందు వచ్చిన వారికి సీనియారిటీ ప్రాతిపదికన సీఎ్‌ఫఎమ్‌ఎ్‌సలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆయా శాఖల బిల్లులు అప్‌లోడ్‌ చేయాలి. కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్‌ పద్ధతిలోనే చెల్లింపు జరగాలి. సీనియారిటీ ప్రకారం చెల్లింపు జరగాల్సినచోట, సీఎంఓ సిఫారసులతో హడావుడిగా బిల్లులు చెల్లించాలనుకోవడమే తప్పు. సీఎంఓ సిఫారసు చేయడం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎంఓ సిఫారసు చేసినా రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎ్‌స అజయ్‌జైన్‌ కోడ్‌ అమలు గురించి ఆలోచించాలి. కోడ్‌ అమల్లోకి వచ్చిన పది రోజుల తర్వాత కూడా బిల్లుల చెల్లింపుపై రెవెన్యూ శాఖకు నోట్‌లు పంపడం గమనార్హం. ఏ ప్రతిపాదికన సీఎంఓ సిఫారసును ఆయన పరిగణనలోకి తీసుకొని బిల్లుల చెల్లింపు కోరుతూ రెవెన్యూ శాఖకు సిఫారసు చేశారు? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కోడ్‌ను ఉల్లంఘించేలా నిర్ణయాలు తీసుకోవడం అజయ్‌జైన్‌కు కొత్త కాదు. కోడ్‌ అమల్లో ఉండగానే సుమోటో కుల ధృవీకరణ చేపట్టాలనుకొని సీఎస్‌ నేతృత్వంలోని స్ర్కీనింగ్‌ కమిటీకి ప్రతిపాదనలు ఇచ్చారు. దాన్ని అమలు చేయడానికి సమర్థనీయ కారణాలు లేవని ఫైలును కమిటీ వెనక్కి పంపించింది. అలాగే 118 మంది డీటీలకు తహసిల్దార్లుగా పదోన్నతులు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఫైలును స్ర్కీనింగ్‌ కమిటీకి పంపించింది. ఈ రెండు అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. ఇవి కోడ్‌ ఉల్లంఘనకు కిందకు వస్తాయని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా భూసేకరణ బిల్లుల అంశంలో సీఎంఓ, అజయ్‌జైన్‌ హడావుడి వెలుగుచూసింది.

Updated Date - Apr 22 , 2024 | 02:47 AM

Advertising
Advertising