ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీరు తినే.. బిర్యానీ భద్రమేనా..?

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:57 AM

మోనో సోడియం గ్లూటోమేట్‌.. దీన్నే చైనాసాల్ట్‌ అని వ్యవహరిస్తారు. అజినోమోటో అంటే త్వరగా గుర్తిస్తారు. దీన్ని డిష్‌ల్లో రుచి కోసం విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నట్టు ఫుడ్‌సేఫ్టీ అధికారులు గుర్తించారు.

Biryani

అప్పుటికప్పుడు వేడివేడిగా టేబుల్‌ మీదకు వస్తున్న డిష్‌ తాజాగా తయారు చేసిందేనా? ఇది కొంతమంది ఆహారప్రియులకు వస్తున్న సందేహం.. చికెన్‌, మటన్‌ బిర్యానీలు ఆర్డర్‌ ఇచ్చేశాం. ఈ రెండూ ఫ్రెష్షేనా? మరికొందరి ప్రశ్న.

ఈ రెండింటిలో వాస్తవం లేకపోలేదు. ఆహార పదార్థాలకు, వెరైటీ డిష్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌ విజయవాడ. ఇక్కడ ఆహార భద్రత ప్రశ్నార్థకం. తోపుడుబండ్లపై విక్రయించే ఆహారం నుంచి హోటళ్లలో సరఫరా చేసే ఆహారం వరకు అన్నీ అనుమానాలు, సందేహాలే. తాజా ఆహారమని చెప్పి సర్వర్లు టేబుళ్లపైకి తెస్తున్న డిష్‌ల్లో తేడాలుంటున్నాయి. తాజాదనం లోపించి కల్తీతత్వం కనిపిస్తోంది. ఈ డిష్‌ల్లో ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు, రంగులు కలుపుతున్నట్టు తేలింది. - ఆంధ్రజ్యోతి - విజయవాడ

మోనో సోడియం గ్లూటోమేట్‌.. దీన్నే చైనాసాల్ట్‌ అని వ్యవహరిస్తారు. అజినోమోటో అంటే త్వరగా గుర్తిస్తారు. దీన్ని డిష్‌ల్లో రుచి కోసం విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నట్టు ఫుడ్‌సేఫ్టీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దీన్ని బిర్యానీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తేలింది. దీని వాడకం వెనుక పెద్ద వ్యవహారమే ఉంది. వాస్తవానికి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపని పదార్థాలను ఉపయోగించి బిర్యానిని రుచికరంగా తయారు చేయాలి. సాధారణంగా బిర్యానీలో మసాలా ఫ్లేవర్‌ ఉంటుంది. దీన్ని చైనా సాల్ట్‌ పెంచుతుంది. హోటళ్లకు వచ్చే ఆహారప్రియులను ఆకట్టుకోవడానికి దీన్ని బిర్యానీల్లో అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. అంతేగాకుండా పసుపు ఛాయ కోసం రంగులు ఉపయోగిస్తున్నారు. బిర్యానీ, చికెన్‌ కర్రీ, మటన్‌ కర్రీ, చేప ఫ్రై, చికెన్‌ మంచురియా, ఎగ్‌ మంచురియా, ఇవన్నీ నాన్‌ విజిటేరియన్‌ డిష్‌లు.

వంటనూనెలో అనేక వ్యత్యాసాలు

వారాంతంలో నగర వాసులు ఏదోక రెస్టారెంట్‌కు కుటుంబ సమేతంగా వెళ్లి పార్టీలు చేసుకుంటారు. ఏ సందర్భంలో వెళ్లినా నాన్‌వెజ్‌ డిష్‌లను ఆర్డర్‌ చేస్తున్నారు. వాటి తయారీలో ఉపయోగించే వంటనూనెలో అనేక వ్యత్యాసాలుంటున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నూనెలో పోలార్‌ కంటెంట్లు 25 శాతానికి మించి ఉంటున్నట్టు తేలింది. ఒక లీటరు నూనెను రెండు, మూడుసార్లు కంటే ఎక్కువగా మరిగించకూడదు. మించి మరిగిస్తే అందులో ఉండే టోటల్‌ పోలార్‌ కాంపొనెంట్స్‌ (టీపీసీ) ఫ్రీ రాడికల్స్‌గా మారుతోందని అధికారులు చెబుతున్నారు. అధికారులు టీపీసీ మీటర్‌తో పరిశీలించినప్పుడు నూనెలో 25శాతం మిం చి ఉండకూడదు. పలు హోటళ్లలో ఈ టీపీసీ 50 నుంచి 75 శాతం చూపించిం ది. ఈ నూనె అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి నూనె లతోనే క్యాన్సర్‌ వంటి వ్యాధులు వస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల నూనె బాగా మరగబెట్టిన అడుగునున్న మడ్డిని తీసి పారేసి అదే నూనెలో కొత్త నూనె కలుపుతున్నారు. ఫుడ్‌కోర్టుల నుంచి రెస్టారెంట్లు, హోటళ్ల వరకు ఇదే తంతు. ఆయా కిచెన్లలో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం. మాంసాహారాల్లో స్పైసీ కోసం రంగులు విపరీతంగా పూస్తున్నారని అధికారులు గుర్తించారు.

Updated Date - Oct 19 , 2024 | 08:20 AM