TTD : తిరుమల, తిరుపతి స్థానికులకు ఉచిత దర్శన టోకెన్ల జారీ
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:14 AM
తిరుమల, తిరుపతి స్థానికులకు ‘ప్రతినెలా మొదటి మంగళవారం దర్శనం’ టోకెన్లను సోమవారం జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్న స్థానికుల దర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో
తిరుమల, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): తిరుమల, తిరుపతి స్థానికులకు ‘ప్రతినెలా మొదటి మంగళవారం దర్శనం’ టోకెన్లను సోమవారం జారీ చేశారు. తాము అఽధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్న స్థానికుల దర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు ఉచిత దర్శన విధానాన్ని తిరిగి ప్రారంభించాలని తీర్మానం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం దర్శనానికి సంబంఽధించి తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఏడు కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేశారు. వేకువజాము 4 గంటలకు ప్రారంభం కాగా, ఉదయం 11.30 గంటల సమయానికి 2,500 టోకెన్లు జారీ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే నాని, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కొంతమంది స్థానికులకు స్వయంగా టోకెన్లు ఇచ్చారు. ఇక, తిరుమలలోని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్‌లో 403 టోకెన్లు జారీ చేశారు.
Updated Date - Dec 03 , 2024 | 05:14 AM