లాజిక్ మరిచిన జగన్
ABN, Publish Date - Sep 05 , 2024 | 04:05 AM
వాస్తవానికి విజయవాడకు ఓ వైపున కృష్ణా నది ప్రవహిస్తే, మరోవైపు బుడమేరు ఉంటుంది. ఈ రెండింటి ప్రవాహ మార్గాలు వేర్వేరు. కృష్ణా నది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తుంది.
కృష్ణా, బుడమేరు ప్రవాహ మార్గాలు వేరు
ఆ గేట్లు ఎత్తకున్నా బాబు ఇంటికి మునక ప్రమాదం లేదు
అయినా పొంతన లేని విమర్శలు
వాస్తవానికి విజయవాడకు ఓ వైపున కృష్ణా నది ప్రవహిస్తే, మరోవైపు బుడమేరు ఉంటుంది. ఈ రెండింటి ప్రవాహ మార్గాలు వేర్వేరు. కృష్ణా నది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తుంది. బుడమేరు ఉమ్మడి కృష్ణా నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్తుంది. కృష్ణా నదిలోని నీటిని బుడమేరుకు వదిలే అవకాశమే లేదు. కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు ఉంటుంది. స్థానిక వాగుల నుంచి కృష్ణా నదిలోకి వచ్చిన భారీ వరదను ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేశారు. బుడమేరు ఉధృతిని తగ్గించడానికే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి కొంత మేర నదిలోకి వదిలారు. అసలు గేట్లు ఎత్తకున్నా చంద్రబాబు ఇంటికి వచ్చే ముంపు ప్రమాదం ఏమీ లేదు. వాస్తవానికి ఆక్రమణలతో బుడమేరు కుంచించుకుపోవడంతో పాటు భారీ వరద ప్రవాహం రావడంతో బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. అయితే జగన్ లాజిక్ మరిచి ఆరోపణలు చేశారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరును ముంచేశారని, విజయవాడలోని ప్రాంతాన్ని నీటిమయం చేశారని జగన్ విమర్శించారు. దీనిపై నెటిజెన్లు ఆడుకున్నారు. ప్రకాశం బ్యారేజీ, బుడమేరు మధ్య దూరం, వ్యత్యాసం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని, లేకుంటే వైసీపీ అబద్ధపు ప్రచారాన్ని జనం నమ్మే ప్రమాదముందని టీడీపీ శ్రేణులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Sep 05 , 2024 | 07:06 AM