ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బియ్యం దొంగలకు జగన్‌ అండ

ABN, Publish Date - Dec 05 , 2024 | 05:09 AM

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్ద కథే ఉంది. గత టీడీపీ ప్రభుత్వం రేషన్‌ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంది.

YS Jagan

2017లోనే కాకినాడ పోర్టులో తనిఖీలు.. అక్రమాలను గుర్తించిన ఆహార కమిషన్‌

40 మందిపై టీడీపీ సర్కారు సుమోటోగా కేసు.. అప్పటి కేసులోనూ ద్వారంపూడి గ్యాంగ్‌

జగన్‌ ప్రభుత్వం వచ్చాక కేసుకు సమాధి.. అక్రమాల్లేవంటూ నిందితులకు క్లీన్‌చిట్‌

నిర్వీర్యమైన రాష్ట్ర ఆహార కమిషన్‌.. గత ఐదేళ్లూ రేషన్‌ మాఫియాకు అండ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్ద కథే ఉంది. గత టీడీపీ ప్రభుత్వం రేషన్‌ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఆహార కమిషన్‌ చైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌, ఇతర సభ్యులు చాలా వరకు అడ్డుకట్ట వేశారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక కథ మళ్లీ మొదటికి రావడమే కాదు నిత్యకృత్యంగా మారిపోయింది. గత ఐదేళ్లూ జగన్‌ సర్కారు రేషన్‌ బియ్యం మాఫియాపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ప్రభుత్వమే అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలిచి మరింత పెంచిపోషించింది. గత టీడీపీ ప్రభుత్వంలో నమోదు చేసిన కేసును నీరుగార్చింది. దీంతో స్మగ్లర్లు అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోయారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించి కోట్లు కొల్లగొట్టారు.

2017లోనే కట్టడి..

రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి వ్యవస్థీకృతమైన రేషన్‌ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ఏడేళ్ల క్రితమే అప్పటి టీడీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలును పర్యవేక్షించడం కోసం కఠిన చర్యలు తీసుకుంది. 2017 ఏప్రిల్‌ 12న రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌గా జేఆర్‌ పుష్పరాజ్‌ను, నలుగురు సభ్యులను నియమించింది. ఈ కమిషన్‌ రేషన్‌ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పటికే పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమార్కులు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు భారీస్థాయిలో ఎగుమతి చేస్తున్నట్లు పత్రికల్లో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల ఆధారంగా పుష్పరాజ్‌, ఇతర సభ్యులు కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టి అనేక అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. ఈ తప్పిదాలకు సంబంధిత అధికారులను బాఽధ్యులను చేస్తూ అక్రమ రవాణా వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేశారు.


జగన్‌ సర్కారు వచ్చాక..

ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే 2019లో జగన్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత కూడా ఆహార కమిషన్‌ చైర్మన్‌గా పుష్పరాజ్‌, నలుగురు సభ్యులు కొనసాగినా... కేసు విచారణ ముందుకు సాగనివ్వకుండా అడ్డంకులు సృష్టించింది. వీరి పదవీకాలం పూర్తయిన తర్వాత రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌గా వైసీపీకి చెందిన చిత్తా విజయప్రతా్‌పరెడ్డిని, మరో నలుగురు సభ్యులను నియమించింది. అదే సమయంలో కరోనా రావడంతో ఆ సాకుతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై సుమోటో కేసు విచారణను రెండేళ్లకు పైగా నిలిపివేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను కొనసాగించినా పథకం ప్రకారం నీరుగార్చారనే విమర్శలున్నాయి. ఈ కేసులో విచారణ సందర్భంగా ప్రతివాదుల నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలాలు తీసుకున్నారు. ‘పీడీఎస్‌ బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు కాకినాడ ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదు. కార్డుదారులకు బయోమెట్రిక్‌ ద్వారా పంపిణీ చేస్తున్నందున బియ్యాన్ని దారిమళ్లించే అవకాశమే లేదు. ఫిర్యాదులు వచ్చినప్పుడు దాడులు నిర్వహించి కేసులు బుక్‌ చేస్తున్నాం. బియ్యం అక్రమ రవాణాపై పర్యవేక్షణ లోపం లేదు. కాబట్టి ఈ కేసును కొట్టివేయవచ్చు’ అంటూ ప్రతివాదులుగా ఉన్న జిల్లా కలెక్టర్లు, జేసీలు, డీఎ్‌సవోలు అఫిడవిట్లు ఇచ్చారు. రేషన్‌ బియ్యం అక్రమ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, కస్టమ్స్‌ క్లియరెన్స్‌తోనే పోర్టుల ద్వారా ఎగుమతులకు అనుమతిస్తామని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల అధికారులు కమిషన్‌ ముందు వివరణలు ఇచ్చారు. ఇక రైసు మిల్లర్లు, వ్యాపారులు న్యాయవాదులను నియమించుకుని తమ వాదనలు వినిపించారు. ఈ కేసుపై గత సెప్టెంబరు 13న రాష్ట్ర ఆహార కమిషన్‌ తుది విచారణ చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం ఆహార ధాన్యాలు అందలేదని లబ్ధిదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రానందున కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ప్రతివాదులు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని, పీడీఎస్‌ బియ్యం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి అక్రమంగా కొనుగోలు చేయకూడదని హెచ్చరించింది. జగన్‌ సర్కారు నియమించిన ఆహార కమిషన్‌లో ఆయన పార్టీకి చెందినవారే ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఐదేళ్లూ అక్రమార్కులు యథేచ్ఛగా రేషన్‌ అక్రమ రవాణా సాగించారు. విదేశాలకు తరలించి వేలకోట్లు దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ దందా వెలుగులోకి వచ్చింది.

కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు తరలింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. వాస్తవానికి... ఇదేమీ కొత్త విషయం కాదు. కొన్నేళ్లుగా సాగిపోతోంది. 2017లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆహార కమిషన్‌ కాకినాడ పోర్టులో తనిఖీలు చేసింది. అక్రమాలను గుర్తించి రేషన్‌ మాఫియాపై సుమోటోగా కేసు నమోదు చేసింది. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఈ కేసును కాకినాడ పోర్టులోనే సమాధి చేసింది. అక్రమాలే జరగలేదని ఆయన నియమించిన ఆహార కమిషన్‌ నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఇందులో ద్వారంపూడి గ్యాంగ్‌ ఉండటమే కారణం. జగన్‌ జమానాలో ఆహార కమిషన్‌ను నిర్వీర్యం చేసేశారు. గత ఐదేళ్లూ భారీ ఎత్తున అక్రమ వ్యాపారం సాగిపోయింది.


ద్వారంపూడి కనుసన్నల్లో...

త టీడీపీ ప్రభుత్వంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబానికి చెందిన మానస క్వాలిటీ ఎంటర్‌ప్రైజె్‌సతో పాటు శ్రీలలిత ఎంటర్‌ప్రైజెస్‌ (పెద్దాపురం), శ్రీ సీతారామాంజనేయ సార్టెక్స్‌(ఉప్పలంక), సరళఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(కాకినాడ), శ్రీమురళీమోహన్‌ బాయిల్డ్‌ అండ్‌ రైస్‌మిల్‌(బిక్కవోలు), శ్రీ విజయలక్ష్మి రా అండ్‌ బాయిల్డ్‌ రైస్‌మిల్‌(కరప), శ్రీ వెంకటేశ్వర ఎక్స్‌పోర్ట్స్‌, శ్రీ చిత్ర అగ్రి ఎక్స్‌పోర్ట్‌ (కాకినాడ), కేపీఆర్‌ రైస్‌మిల్స్‌(కొమరిపాలెం), ఓలం ఆగ్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(కాకినాడ), బిబో ఇంటర్నేషనల్‌ (తాళ్లరేవు, చొల్లంగి), చంద్రిక మిల్స్‌(రాయవరం), సమీర ఆగ్రో ఇండస్ట్రీస్‌ (రాజానగరం), అయ్యప్ప ఎక్స్‌పోర్ట్స్‌(చొల్లంగి), శ్రీ రామలింగేశ్వర రైస్‌మిల్‌ (తణుకు), పట్టాభి ఆగ్రో ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (తణుకు), ఐటీసీ లిమిటెడ్‌ (కొడవలూరు), మాస్టర్‌ బిజినెస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌(విశాఖపట్నం)పై కేసు నమోదు చేశారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లు, జేసీలు, డీఎ్‌సవోలు, కాకినాడ, కృష్ణపట్నం పోర్టు అధికారులతో సహా 40మందిని ప్రతివాదులుగా చేర్చారు. వారందరినీ విచారణకు రావాలని ఆహార కమిషన్‌ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

Updated Date - Dec 05 , 2024 | 10:57 AM