జనంపై మళ్లీ సర్దు‘పోటు’
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:06 AM
జగన్ ప్రభుత్వ పాపం విద్యుత్తు వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది.
జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం రూ.9,412 కోట్లు
ప్రభుత్వంపై 1,500 కోట్ల వ్యవసాయ రాయితీ భారం
వచ్చే నెల నుంచి యూనిట్‌కు 92 పైసలు వసూలు
2026 నవంబరు దాకా వసూలుకు ఈఆర్‌సీ ఆదేశం
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ పాపం విద్యుత్తు వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు ఎడాపెడా విద్యుత్తు కొనుగోలు చేసినందుకు గాను ఇప్పుడు జనంపై సర్దుబాటు చార్జీల భారం పడుతోంది. జగన్ పాలనకు సంబంధించి ఆఖరి ఇంధన సర్దుబాటు భారం రూ.9,412 కోట్లు కాగా, ఇందులో రూ.1,500 కోట్లు వ్యవసాయ విద్యుత్తు రాయితీ కింద డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.12,844 కోట్లు సర్దుబాటు చేసేందుకు ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి. అందులో రూ.3,432 కోట్లుకు కోత విధించిన ఈఆర్‌సీ... మిగిలిన రూ.7,912 కోట్లు (వ్యవసాయ సబ్సిడీ రూ.1,500 కోట్లు పోను) ప్రజల నుంచి వసూలు చేసుకొనేందుకు ఆమోదం తెలిపింది. ఈ సర్దుబాటు చార్జీలను యూనిట్‌కు 92 పైసలు చొప్పున వచ్చే నెల (డిసెంబరు) నుంచి 2026 నవంబరు వరకూ వసూలు చేయాలని డిస్కమ్‌లను ఆదేశించింది.
Updated Date - Nov 30 , 2024 | 05:07 AM