Jagan : నేనొస్తే.. అందర్నీ లోపలేస్తా
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:33 AM
మూడేళ్ల క్రితం జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సంబంధం లేనివారిని అరెస్టు చేస్తున్నారని, టీడీపీ తప్పుడు సంప్రదాయాని కి బీజం వేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు.. ఆ పార్టీ నేతలందరికీ ఇదేగతి
బాబు నిర్లక్ష్యం వల్లే బెజవాడ మునక.. వరదల్లో 60 మంది మృతి
బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల యజమానులు టీడీపీ వారే: జగన్
గుంటూరు, సెప్టెంబరు 11: మూడేళ్ల క్రితం జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సంబంధం లేనివారిని అరెస్టు చేస్తున్నారని, టీడీపీ తప్పుడు సంప్రదాయాని కి బీజం వేస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రేపు తాము అధికారంలోకి వేస్త ఈ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుందని, జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు. కొంతమంది పోలీసు లు కూడా ఈ కేసులో సాక్షాలు, ఆధారాలు సృష్టించి సంబంధం లేని వారిని నిందితులుగా చేర్చారని ఆరోపించారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేతలు మాజీ ఎంపీ నందిగం సురేశ్, అవుతు శ్రీనివాస్ రెడ్డిని జగన్ పరామర్శించా రు. మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ ముంపునకు గురై 60 మంది మృతిచెందారని, దీనికి సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కారణం కాదా అని ప్రశ్నించారు. చం ద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదన్నారు. ప్రభుత్వ తప్పుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మూడేళ్ల క్రితం జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనను ఇప్పుడు బయటకు తీశారని ఆరోపించారు. ‘‘పైనుంచి కృష్ణా నదికి వరద వస్తుందని బుధవారమే హెచ్చరికలు వచ్చినా శుక్రవారం వరకు చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోలేదు. చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే విజయవాడ నీట ముని గి 60 మంది మృతిచెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడం కోసం కృష్ణాలోకి వస్తున్న బుడమేరు గేట్లను అర్ధరాత్రి ఎత్తేశారు. ఇంతకంటే దారుణమైన పరిపాలన ఏమైనా ఉంటుందా?’’ అన్నారు.
ఎవరైనా చెబితే దాడి చేస్తారా?
‘‘నాడు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో అప్పటి సీఎం(జగన్)ను భోష్‌డీకే అని తిట్టాడు. భోష్‌డీకే అంటే లంజాకొడకా అని అర్థం. ముఖ్యమంత్రిని ప్రేమించేవారికి, వైసీపీని అభిమానించే వారికి ఈ విధంగా తిడితే కడుపు మండదా? కడుపు మండినవారు, ఈ అన్యాయాన్ని చూడకూడదు అనుకునేవారు కొంతమంది టీడీపీ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. అంతేకానీ ఎవరైనా చెబితే వచ్చి దాడి చేస్తారా? టీడీపీ కార్యాలయం వద్ద ధర్నా చేేసందుకు వెళ్లిన వారి పై టీడీపీ వారే దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా తొక్కిసలాటలో కొద్దో, గొ ప్పో పార్టీ కార్యాలయంపై రాళ్లు పడి ఉండవచ్చు. అయినప్పటికీ విచారణ జరిపిం చి, సీసీ కెమెరాలను పరిశీలించి సెల్‌ఫోన్ లోకేషన్ల ఆధారాలను పరిశీలించి టీడీపీ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్లిన వారందరిని గుర్తించారు. వారికి 41ఏ నోటీసు ఇచ్చి కోర్టులో హాజరు పరిచాం. దాడి ఘటనలో మాజీ ఎంపీ సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్ రెడ్డి ఉన్నారా?’’ అని జగన్ అన్నారు.
ఆ బోట్లు మా వారివి కావు
‘‘ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన బోట్లకు బాబు ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మూడున్నర నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం వచ్చిన సమయంలో విజయోత్సవాలు చేసుకున్న వారిలో ఆయా పడవల యజమానులు లేరా? ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకోలేదా? 4 నెలలుగా చంద్రబాబుతో కలసి ఇసుక దోపిడీలో ఆ పడవల యజమానులు భాగస్వాములు కాదా? ఓ బోటు యజమాని ఉషాద్రి ఎవరు? చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు దిగిన పరిస్థితి ఉంది. ఆయన టీడీపీలో క్రియాశీలకంగా కూడా పని చేశారు. మరో బోటు యజమాని రామ్మోహన్ ఎన్నారై టీడీపీ నేత జయరాం సోదరుడి కుమారుడు. ఆలూరి చిన్నాకు టీడీపీతో ఉన్న సంబంధం ఏమిటి? ఆయా వ్యక్తులు, బోట్ల యజమానులు టీడీపీ వారే. ఆ పడవలు వరదకు ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకొేస్త రాజకీయం చేయాలని, వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారు’’ అని జగన్ అన్నారు.
Updated Date - Sep 12 , 2024 | 03:33 AM