ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నోరే కదా.. అనేస్తే పోలా!

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:02 AM

తన కుటుంబంలో విభేదాలున్నాయని, అవి వీధినపడ్డాయని చెబుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్నీ బజారుకీడ్చడానికి జగన్‌ నానా తంటాలు పడుతున్నారు.

చంద్రబాబు కుటుంబంపై జగన్‌ అక్కసు

నిరాడంబరతకు మారు పేరు వారు

ఏనాడూ నారావారిపల్లె దాటని తల్లిదండ్రులు

అధికారం వైపు కన్నెత్తిచూడని తోబుట్టువులు

బాబే వెళ్లి వారందరినీ చూసి వస్తున్న వైనం

వారి గురించి తెలియకుండా జగన్‌ అవాకులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తన కుటుంబంలో విభేదాలున్నాయని, అవి వీధినపడ్డాయని చెబుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్నీ బజారుకీడ్చడానికి జగన్‌ నానా తంటాలు పడుతున్నారు. తల్లిదండ్రులను భోజనానికి పిలిచారా... తలకొరివి పెట్టారా? వారిని ప్రపంచానికి చూపించారా.. అని జగన్‌ కొత్త ప్రశ్నలేస్తున్నారు. చంద్రబాబు 1975 ప్రాంతంలో విద్యార్థి సంఘనేతగా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత యూత్‌ కాంగ్రెస్‌ నేతగా, అలా..అలా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. కుమారుడి విజయాలకు తల్లిదండ్రులు లోలోపల ఆనందించి ఉంటారు గానీ పేరొందిన నాయకుడి తల్లిదండ్రులుగా వారెప్పుడూ భావించలేదు. చంద్రబాబు 1995 సెప్టెంబరు 1న సీఎంగా ప్రమాణం చేశారు. ఆయన తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేద్దామని తిరుపతి నుంచి విలేకరులు నారావారిపల్లె వెళ్లారు. తల్లి అమ్మణ్ణమ్మ ఇంటి దగ్గర లేరు. తండ్రి ఖర్జూర నాయుడు మాత్రం నిద్రిస్తున్నారు. ఇరుగుపొరుగువారిని అడిగితే ఆమె పొలానికి వెళ్లారని చెప్పారు. అటు వెళ్లిన మీడియా ప్రతినిధులకు చంకలో బుట్ట పెట్టుకొని గట్టుపై నడుస్తూ ఆమె కనిపించారు. ‘‘అమ్మ...బాబన్న సీఎం అయ్యారు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు’’ అని అంటే ‘‘ఇవ్వాళ్ల కూలోల్లు రాలేదయ్యా. ఏడ పని అక్కడే ఆగిపోయింది.

పోయి పనిచేసుకోవాలా’’ అంటూ ఆమె ముందుకు నడిచారు. ‘‘అదేమిటి? బాబన్న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి మిమ్ములను పిలుచుకొని వెళ్లలేదా’’ అని అడిగితే... ‘‘వాడు రమ్మన్నాడయ్యా. అంత పెద్ద ఊరులో మేం ఉండలేం. మీ తాతకు (చంద్రబాబు తండ్రి) ఇల్లు ఇడిసిపెట్టి బయటకు పోవడం ఇష్టం ఉండదు’’ అని ఆమె సింపుల్‌గా తేల్చేశారు. చంద్రబాబు సీఎం కాకముందు మంత్రిగా, కర్షక పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. అప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు, తోబుట్టువులు అతి సాధారణ జీవితమే గడిపారు. ఆ కుటుంబంలో ఎవరూ తాము సీఎం బంధువులమని వీర్రవీగనూ లేదు. ఏ హడావుడీ చేయలేదు. వారు తన వద్దకు రారు కాబట్టే చంద్రబాబే వారి వద్దకు వెళ్తుంటారు. సంక్రాంతికి ఇంటికి వెళ్లి కుటుంబంతో గడపడానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం కూడా ఇదే. అంత సింపుల్‌గా ఉన్న కుటుంబం ప్రస్తావన తెస్తూ.. ‘అందరికీ చూపించావా.... అన్నం పెట్టావా?’ అని జగన్‌ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. నోటికొచ్చిందల్లా మాట్లాడేయడం, తనలాగే ఇతరులూ బజారున పడాలని ఆశించడం జగన్‌ నైజమని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

Updated Date - Nov 21 , 2024 | 05:02 AM