ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన నీ డ్రామాలు ఆపు : టీడీపీ

ABN, Publish Date - Dec 15 , 2024 | 12:05 AM

అధికారంలో ఉన్న సమయంలో రైతన్నలను అనేక కష్టాలకు గురి చేసిన మాజీ సీఎం జగన మోహన రెడ్డి, వైసీపీ నాయకులు నేడు రైతన్న పేరుతో వారి ఉనికిని చాటుకోవడం కోసం ధర్నాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని, ఇక మీ డ్రామాల ఆపాలని రాష్ట్ర మాదిగ కార్పొరేషన డైరెక్టర్‌ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ దళిత నిరుపేద సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ధరూర్‌ జేమ్స్‌ అన్నారు.

కర్నూల అర్బన, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న సమయంలో రైతన్నలను అనేక కష్టాలకు గురి చేసిన మాజీ సీఎం జగన మోహన రెడ్డి, వైసీపీ నాయకులు నేడు రైతన్న పేరుతో వారి ఉనికిని చాటుకోవడం కోసం ధర్నాలు చేపట్టడం విడ్డూరంగా ఉందని, ఇక మీ డ్రామాల ఆపాలని రాష్ట్ర మాదిగ కార్పొరేషన డైరెక్టర్‌ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ దళిత నిరుపేద సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ధరూర్‌ జేమ్స్‌ అన్నారు. శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల పట్టాల పేరుతో అసైన్డ భూములు చట్టానికి విరుధంగా నిరుపేద రైతుల భూములను బలవంతంగా లాగేసుకుని రైతన్నల కడుపు కొట్టిన జగన రెడ్డి, ఆ పార్టీ నాయకులకు నేడు రైతన్న గుర్తుకు రావడం విడ్డూరమన్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన రెడ్డి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, జడ్పీచైర్మను, ఇద్దరు మంత్రులు ఉండి జిల్లాలో ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌, ఎ ల్లెల్సీ, గుండ్రేవుల వేదవతి వంటి పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నాడు-నేడు అంటూ ప్రగల్బాలు పలికిన జగనరెడ్డ్డి నేడు కూటమి ప్రభుత్వ హయాంలో రైతన్న స్థితిగతుల పై మీడియా సముఖంగా బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 15 , 2024 | 12:05 AM