ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaganan's layout Dispute : జగనన ్న లేఅవుట్‌లో స్థలాల వివాదం

ABN, Publish Date - Sep 08 , 2024 | 11:13 PM

గండికోటకు వెళ్లే దారి ఒంటిమిద్దె గ్రామ సమీపాన ప్రధాన రోడ్డు పక్కన పూర్వపు బొమ్మేపలె ్ల జగనన్న లేఅవుట్‌ స్థలాల్లో ఆదివారం వివాదం చోటు చేసుకుంది.

బేస్‌మెంట్‌ రాళ్లు పక్కన పడవేసిన దృశ్యం

జమ్మలమడుగు, సెప్టెంబరు 8: గండికోటకు వెళ్లే దారి ఒంటిమిద్దె గ్రామ సమీపాన ప్రధాన రోడ్డు పక్కన పూర్వపు బొమ్మేపలె ్ల జగనన్న లేఅవుట్‌ స్థలాల్లో ఆదివారం వివాదం చోటు చేసుకుంది. సీఐ లింగప్ప వివరాల మేరకు బొమ్మేపల్లె వాసులు ముర్రా రాజశేఖర్‌రెడ్డి, హరినాథరెడ్డి సహా మరో నలుగురు జగనన్న లేఅవుట్‌లో ఎక్స్‌కవేటర్‌తో బేస్‌ మెంట్‌ రాళ్లను పునాది కోసం తీసిన మట్టి, రాళ్లను పెకిలించినట్లు పలువురు గ్రామస్తులు స్టేషన్‌ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వెంటనే సమస్యను పరిశీలించేందుకు తమ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు సీఐ తెలిపారు. అక్కడ పెద్దబాలిగారి లక్ష్మిదేవి, దేవి బేస్‌ మెంట్‌, పునాది రాళ్లకు సంబంధించి పక్కకు తీసి పడవేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. సర్వే నంబరు 381, 382లో 180 ప్లాట్లు అప్పట్లో అధికారులు లేఅవుట్లు వేసినట్లు 40 నుంచి 44 మందికి పట్టాలు ఇచ్చినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. అయితే సీఐ లింగప్ప, ఎస్‌ఐ రామకృష్ణ గ్రామస్థులతో మాట్లాడి ప్రస్తుతం ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తామని తహసీల్దారు శ్రీనివాసరెడ్డి విజయవాడకు వెళ్లాడని, మూడు రోజులు గడువు ఇస్తున్నామని తహసీల్దారు వచ్చిన వెంటనే పట్టాలకు సంబంధించి రికార్డు పరిశీలించి జరిగిన ఘటనకు సంబందించి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కల్పన, పోలీసు సిబ్బంది, బొమ్మేపల్లె బాధిత ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 11:13 PM

Advertising
Advertising