ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jai Bharath National Party: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టో విడుద‌ల‌

ABN, Publish Date - Jan 25 , 2024 | 11:53 AM

జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల‌ చేసింది. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అధ్య‌క్ష‌త‌న న‌డుస్తున్న‌ జైభార‌త్ పార్టీ మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. విద్యార్ది, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు.

విజయవాడ: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ మేనిఫెస్టోను విడుద‌ల‌ చేసింది. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అధ్య‌క్ష‌త‌న న‌డుస్తున్న‌ జైభార‌త్ పార్టీ మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. విద్యార్ది, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఓటర్ల దినోత్సవమని.. ఓటు ప్రాధాన్యతను తెలిపే రోజని అన్నారు.

అందువల్లే ఈ రోజు జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. ఇది ప్రజల్లో నుంచి వచ్చిన మేనిఫెస్టో అన్నారు. కాబట్టే.. ఇధి పీపుల్స్ మేనిఫెస్టో అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను రూపొందించామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం తాము పోరాటం సాగిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను పరిశీలించి, ప్రజలతో మాట్లాడిన తర్వాత ఈ మేనిఫెస్టో తయారు చేశామన్నారు. అన్నదాత లేకుంటే మనం లేమని... రైతులను ఆదుకోవాలన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలని లక్ష్మీనారాయణ అన్నారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

స్వామినాథన్ ఉపాధి హామీ కింద ప్రతినెలా రైతులకు ఐదు వేలు

రైతు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

సామాజిక వర్గాల పేరుతో రైతన్నలను జైభారత్ పార్టీ విడదీయదు

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి.. వారికి రుణాలు ఇచ్చేలా చేస్తాం

రైతులకు వడ్డీ లేని రుణాలు.. చట్టబద్దంగా రైతు కమిషన్ ఏర్పాటు

విత్తన చట్టం తెస్తామని పదేళ్లుగా కేంద్రం చెబుతున్నా.. దానిని తీసుకు రావడం లేదు

రాష్ట్రస్థాయిలో విత్తన చట్టం తీసుకువచ్చి అమలు చేస్తాం

ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు పదిహేను వేలు.. పదిహేను రోజుల్లో చెల్లించే ఏర్పాటు చేస్తాం

ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం

ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ నెలకొల్పుతాం

సొంత ప్రాంతాల్లోనే ఉపాధి మార్గాలను చూపిస్తాం

పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తాం

ఏడాదిలో వంద రోజులు ఉపాధి హామీ కింద పనులు అప్పగిస్తాం

జైభారత్ పార్టీ ప్రతి ఏడాది జనవరి 26న రిపబ్లిక్ రోజున గ్రూపు వన్, గ్రూప్ టూ నోటిపికేషన్, సెప్టెంబర్ లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం

అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం.

Updated Date - Jan 25 , 2024 | 12:04 PM

Advertising
Advertising