ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena Cheif Pawan :కూటమిదే భారీ విజయం

ABN, Publish Date - May 14 , 2024 | 03:27 AM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం తథ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు.

మార్పు కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారు

వారాణసీలో మీడియాతో పవన్‌

నేడు మోదీ నామినేషన్‌కు హాజరు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం తథ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు. వారాణసీ లోక్‌సభ నియోజవర్గం నుంచి పోటీకి దిగుతున్న ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షాలు తెలిపేందుకు సతీసమేతంగా వారాణసీ చేరుకున్న పవన్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘భారీ మెజార్టీతో ఎన్డీయే కూటమి ఏపీలో గెలవబోతోంది. ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పును ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సుపరిపాలన అందించేలా పాలన ఉండబోతోంది. దేశ ప్రధాని మోదీపై అపార గౌరవం. ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలనే సంకల్పంతో మద్దతు తెలియజేసేందుకు వచ్చాను.

మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకువెళ్తోంది. ఈ కీలక సమయంలో దేశ ప్రజలంతా తోడుగా ఉంటారని భావిస్తున్నా. ఏపీలోనూ ఎన్డీయే కూటమి రాష్ట్ర పురోగమనానికి తగిన విధంగా పని చేస్తుంది. ప్రజాపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విజేతగా నిలుపుతాం’ అని పవన్‌ పేర్కొన్నారు.

Updated Date - May 14 , 2024 | 03:27 AM

Advertising
Advertising