ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: పవన్ ప్రాణాలకు ముప్పు.. ఇవిగో సాక్ష్యాలు

ABN, Publish Date - Apr 22 , 2024 | 06:17 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జనసైనికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం భీమవరంలో పవన్ కల్యాణ్.. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడ.. ఇద్దరు వ్యక్తులు ఆనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pawan kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జనసైనికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం భీమవరంలో పవన్ కల్యాణ్.. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడ.. ఇద్దరు వ్యక్తులు ఆనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

YS Sharmila: వెలుగొండ పూర్తి చేయకుండా ఇన్నాళ్లు గాడిదలు కాశారా? .. షర్మిల ఫైర్

ఈ సందర్బంగా సదరు యువకుల జేబుల్లో నుంచి పోలీసులు చాకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా.. ఫ్యాన్స్ పేరుతో బ్లేడ్లతో చేతులు కోస్తున్నారన్నారు. తనతోపాటు తన భద్రత సిబ్బందిపైన బ్లేడ్లతో దాడి జరిగిందని చెప్పారు. ఇక కాకినాడ వరాహి యాత్రలో తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా పవన్‌.. తెనాలి పర్యటనలో ఉండగా.. ఆయనపై ఆగంతకుడు రాయితో దాడి చేశారు. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తే పవన్‌కు ప్రాణ హాని ఉందని స్పష్టమవుతుందని జన సైనికులు స్పష్టం చేస్తున్నారు. అదీకాక .. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పవన్ భద్రతపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

AP Election 2024: పవన్ ప్రయాణించాల్సిన హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం


ఈ ప్రభుత్వ వైఖరి నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు బయటకు వస్తే.. వారిపై ఓ విధమైన కఠిన వైఖరితో ఈ ప్రభుత్వం వెళ్తుందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో సైతం పవన్ కల్యాణ్‌పై ఈ జగన్ ప్రభుత్వం చాలా అమానుషంగా వ్యవహరించిందని వారు గుర్తు చేశారు.

AP Elections : మహిళలకు ఫ్రీ బస్.. అదిరిందిగా..

ఆ సమయంలో హోటల్ గది నుంచి బయటకు వచ్చి గాలి పీల్చుకోవచ్చా? అంటూ ఎక్స్ వేదికగా పవన్ ప్రశ్నించిన విషయాన్నిఈ సందర్బంగా వారు ప్రస్తావిస్తున్నారు. పవన్‌కు ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య దూరం పెంచేందుకు ఈ ప్రభుత్వం ఈ తరహాగా వ్యహరించిందని మండిపడుతున్నారు. ఆ క్రమంలో పోలీసు అధికారులు సైతం అధికార పార్టీకి సహకరిస్తున్నారని చెబుతున్నారు.

LokSabha Elections 2024: జయహో పాటకు.. శశిథరూర్ స్టెపులు

ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని... ఆ సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న పవన్ కల్యాణ్‌పై ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.


అలాగే తమ పొలాల్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించుకోవచ్చునని ఇప్పటం గ్రామస్తులు.. పవన్ కల్యాణ్‌కు తెలిపారు. ఆ క్రమంలో ఆ గ్రామంపై జగన్ ప్రభుత్వం ఎంత మెండి వైఖరితో వెళ్లిందో అందరికి తెలిసిందేనని వారు వివరిస్తున్నారు. ఆ గ్రామాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న పవన్ కల్యాణ్‌ను సైతం పోలీసులతో నిలువరించేలా వ్యవహరించారని జనసైనికలు పేర్కొంటున్నారు.

Election Commission: అరుణాచల్‌ప్రదేశ్‌లో 8 కేంద్రాల్లో రీ పోలింగ్

ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు చేరువ కాకూడదనే లక్ష్యంతో అధికార పార్టీ పక్క ప్రణాళికతో ఈ తరహాగా వ్యవహరిస్తున్నారని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కట్టిన పన్నులు జీతాలుగా తీసుకుంటూ... అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసుల వైఖరిని వారు తప్పు పడుతున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 22 , 2024 | 06:17 PM

Advertising
Advertising