ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నీ వెనుక నేనున్నా

ABN, Publish Date - Apr 09 , 2024 | 04:40 AM

నీ వెనుక నేనున్నా’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆయన అన్న, ప్రముఖ హీరో చిరంజీవి అభయం ఇచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్లో విశ్వంభర

పవన్‌కు అన్న చిరంజీవి అభయం

పార్టీ కోసం 5 కోట్ల విరాళం

మెగాస్టార్‌ ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ‘నీ వెనుక నేనున్నా’ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆయన అన్న, ప్రముఖ హీరో చిరంజీవి అభయం ఇచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్లో విశ్వంభర షూటింగ్‌ లోకేషన్‌కు చిరంజీవి పిలుపు మేరకు పవన్‌ కల్యాణ్‌ వెళ్లారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు ఆయన చిన్న అన్నయ్య, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఉన్నారు. ఉదయం పదిగంటలకు లొకేషన్‌కు చేరుకున్న పవన్‌ను చిరంజీవి ఆలింగనం చేసుకుని, స్వాగతం పలికారు. అనంతరం జనసేన ఎన్నికల నిర్వహణ కోసం రూ.5 కోట్లు విరాళంగా అందించారు. పవన్‌ చెక్కు స్వీకరిస్తూనే చిరంజీవి పాదాలకు సమస్కరించారు. ఆ సమయంలో ఆయన కొంత ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం సోదరులు ముగ్గురూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయ భేరి సభలో పవన్‌ నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చిరంజీవి టీవీలో చూశారు. ఆక్షణంలోనే తన తమ్ముడికి తన ఆశ్వీరాదంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం పవన్‌ను తన షూటింగ్‌ లోకేషన్‌కు పిలుపించుకున్నారు. ఆశీర్వాదంతో పాటు రూ.5 కోట్ల చెక్కునూ అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘‘స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చుపెట్టే నిస్వార్థమైన మనసున్నవాడు కల్యాణ్‌. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తాను ఎంత తపన పడుతున్నాడో, ఎంత శ్రమపడుతున్నాడో నాకు తెలుసు. నేను ఇచ్చే ఈ విరాళం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతైనా ఉపయోగపడుతుందని భావించాను. నా తమ్ముడు ఎలాంటి సత్కార్యం తలపెట్టినా నా ఆశీస్సులు ఉంటాయి. తను వేసే ప్రతి అడుగూ విజయం దిశగానే సాగాలని కోరుకుంటూ ఈ విరాళాన్ని అందించాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, కోశాధికారి ఎంవీ రత్నం, ప్రధాన కార్యదర్శి ఆజయ్‌కుమార్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2024 | 04:40 AM

Advertising
Advertising