ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జనసేనకే గాజుగ్లాసు గుర్తు

ABN, Publish Date - Apr 17 , 2024 | 03:29 AM

జనసేన పార్టీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. గుర్తు

హైకోర్టులో పవన్‌ పార్టీకి భారీ ఊరట

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజుగ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. గుర్తు కేటాయింపు విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ విధానంలో జనసేనకు గుర్తు కేటాయించామని కేంద్ర ఎన్నికల సంఘం సమర్పించిన వివరాలతో ఏకీభవిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మంగళవారం తీర్పు ఇచ్చారు. జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు కేటాయించడంతో పాటు అందుకు సంబంధించిన రికార్డును కోర్టు ముందు ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రె్‌స(సెక్యులర్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమహేంద్రవరానికి చెందిన మేడా శ్రీనివాస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.వి. రాజారామ్‌ వాదనలు వినిపించారు. గాజుగ్లాసు గుర్తు కోసం పిటిషనర్‌ పార్టీ గతే డాది డిసెంబరు 20న దరఖాస్తు చేసుకుందని తెలిపారు. డిసెంబరు 12న జనసేన పార్టీ చేసిన దరఖాస్తు నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. జనసేన పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ... గాజుగ్లాసు గుర్తు కోసం జనసేన గత డిసెంబరు 12న దరఖాస్తు చేసిందన్నారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపించారు. గాజుగ్లాసు గుర్తు కోసం మొదట జనసేన పార్టీయే దరఖాస్తు చేసుకుందని, ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ విధానంలో ఆ పార్టీకే ఆ గుర్తు కేటాయించామన్నారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో ఏప్రిల్‌ 4న తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టివేస్తూ మంగళవారం నిర్ణయాన్ని వెల్లడించారు.

Updated Date - Apr 17 , 2024 | 03:29 AM

Advertising
Advertising