Jharikona project : సమస్యల నడుమ ఝరికోన ప్రాజెక్టు
ABN, Publish Date - Sep 08 , 2024 | 11:23 PM
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సుండుపల్లి మండల రైతుల పరిస్థితి తయారైంది. ఝరికోన ప్రాజెక్టులో నీరు న్నా నిరుపయోగంగా మారింది. వైసీపీ ప్రభుత్వం లో ఝరికోన ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది.
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
సుండుపల్లి, సెప్టెంబరు 8: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా సుండుపల్లి మండల రైతుల పరిస్థితి తయారైంది. ఝరికోన ప్రాజెక్టులో నీరు న్నా నిరుపయోగంగా మారింది. వైసీపీ ప్రభుత్వం లో ఝరికోన ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. కనీసం కాల్వల నిర్మాణానికి కూడా నోచుకోక పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి పాలనలో జలాశయం నుంచి కంభంవారిపల్లి, కలికరి తదితర మండలాలకు తాగునీటి పథకం మంజూరు చేసి పూర్తి చేశారు. సుండుపల్లి రైతాంగం కోసం బాహుదానదిలో కాల్వ లు ఏర్పాటు చేయని కారణంగా ఈ ప్రాంతీయుల కు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. కొన్నేళ్లగా పూర్తి చేస్తామని ప్రజాప్రతినిధుల హామీ లు నీటిమీద రాతలయ్యాయి. జలాశయం తూము మరమ్మతులకు గురై ఏడేళ్లయినా పనులు జరగక పోవడం గమనార్హం. వివరాల్లోకెళితే....
అన్నమయ్య జిల్లాలోని సుండుపల్లి, సంబేపల్లి ప్రాంతాల తాగు, సాగునీటి కోసం ఝరికోన ప్రాజె క్టు నిర్మించారు. అయితే సుండుపల్లి రైతాంగం కోసం బాహుదానదిలో కాల్వలు ఏర్పాటు చేయని కారణంగా ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ప్రాజెక్టు దిగువ భాగంలో సాగు నీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందు లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో బాహు దా జలసాధన జలసంరక్షణ సమితి పోరాటాలతో తూమును ఏర్పాటు చేశారు. దాదాపు ఏడేళ్ల కింద ట తూముగేటుకు ఏర్పాటు చేసిన అనుబంధ కడ్డీ విరిగి పోయింది. అప్పట్లో గేటు తొలగించి బాహు దా నదిలోకి నీరు పోకుండా, ప్రాజెక్టులో నీరు నిలిచేలా తూములోకి నీరు రాకుండా కాంక్రీటు వేశారు. ఏడేళ్లువుతున్నా గేటు మరమ్మతులను పట్టించుకోలేదు. కరవుతో రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఏడాది జూ లైలో కరవు పరిస్ధితులతో సాగు నీరులేక ఇబ్బం దులు పడుతున్నామని కూటమి నేతలు, నీటి పారుదలశాఖ అఽధికారుల దృష్టికి సుండుపల్లి మండల రైతులు తీసుకుపోయి నదిలోకి సైపన్ పద్ధతిలో ప్లాస్టిక్ పైపుల ద్వారా నీటిని విడుదల చేశారు. జలాశయ నీరు దిగువకు వచ్చేలా చేశా రు. 15 రోజుల తరువాత గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ పైపులను కత్తిరించారు. కాల్వల నిర్మాణానికి ఆలస్యమైనా గేటు ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
వైసీపీ నిర్లక్ష్యం..రైతులకు శాపం
దశాబ్దలుగా కాల్వల ఏర్పాటు కలగానే మిగిలింది. ప్రత్యక్షంగా 5 వేల ఎకరాల సాగుభూమికి నీటిని అందించే అవకాశంవున్నా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎటువంటి ముందడుగు పడలేదు. అప్ప ట్లో కనీసం సమస్యను అప్పటి ముఖ్యమంత్రి దృష్టి కి కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు తీసుకుపోలేక పోయా రు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారేకానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్ని సార్లు రైతులు, ప్రజా సంఘలు, ప్రతిపక్ష పార్టీలు వినతు లు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. కాల్వలు ఏర్పాటైతే మండలంలోని సగం మంది రైతులకు సాగు నీటి సమస్య లేకుండా పోతుంది. ఇదంతా తెలిసినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చింది. కాల్వలు ఏర్పాటు చేయాలని రైతులు, మండల ప్రజలు కోరుతున్నారు.
నూతన వ్యయంతో ప్రతిపాదనలు
ఏడాది కిందట రూ.59 లక్షలతో ప్రతిపాదనలు పంపించాము. ప్రభుత్వం నుంచి అప్పట్లో అనుమతులు రాలేదు. ప్రభుత్వం మారింది. నూతన వ్య యంతో ప్రతిపాదనలు పంపిం చాల్సి వుంది. త్వరలో ప్రతిపాదన లు పంపి గేటు పునరుద్ధరణకు కృషి చేస్తాము. ఉన్నతాధికారు లకు సమస్యను తెలియజేశాము.
వెంకట్రామయ్య, కార్యనిర్వహణాధికారి, జిల్లా జలవనరులశాఖ
Updated Date - Sep 08 , 2024 | 11:23 PM