ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కడప తహశీల్దార్‌ శివప్రసాద్‌ అరెస్టు

ABN, Publish Date - Apr 01 , 2024 | 03:42 AM

ఆదాయానికి మించి దాదాపు రూ.70 కోట్ల చర, స్థిరాస్తులు కూడబెట్టిన కేసులో కడప తహశీల్దార్‌ సిద్దాల శివప్రసాద్‌ను విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఆదివారం అరెస్టు చేశారని ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు.

14 రోజుల రిమాండ్‌

తిరుపతి క్రైం, మార్చి 31: ఆదాయానికి మించి దాదాపు రూ.70 కోట్ల చర, స్థిరాస్తులు కూడబెట్టిన కేసులో కడప తహశీల్దార్‌ సిద్దాల శివప్రసాద్‌ను విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఆదివారం అరెస్టు చేశారని ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు. ఆయనకు నెల్లూరు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తహశీల్దారుగా పనిచేసిన శివప్రసాద్‌ అనతికాలంలోనే కోట్లకు అధిపతిగా ఎదిగారు. తిరుపతి, రేణిగుంట, కడప ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు, మాల్స్‌, ప్లాట్స్‌, భవనాలు, అపార్టుమెంట్లు సమకూర్చుకున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజయవాడ అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం శనివారం రంగంలోకి దిగింది. పీలేరు, తిరుపతి, రేణిగుంట, బంగారుపాళెం, కడప ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు రూ.70 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్టు గుర్తించారు. తాజాగా.. రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకులకు ఏసీబీ అధికారులు లేఖలు రాశారు. శివప్రసాద్‌, ఆయన భార్య మాధవి, బంధువులు, బినామీ పేర్లతో ఎక్కడైనా అకౌంట్లు ఉంటే వెంటనే లావాదేవీలు ఆపి.. ఖాతాలను సీజ్‌ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే సోమవారం నుంచి బ్యాంకు లాకర్లు పరిశీలించడానికి ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే తహసీల్దార్‌కి సంబంధించిన బినామీల జాబితాను తెప్పించుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడానికి చర్యలు చేపట్టారు.

Updated Date - Apr 01 , 2024 | 03:43 AM

Advertising
Advertising