నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:50 PM

ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామ ని పీకేఎం-ఉడా వైస్‌ చైర్మన బాబర్‌, డీఎల్పీవో నాగరాజు హెచ్చరించారు.

నిబంధనలు అతిక్రమించి లేఅవుట్‌లు వేస్తే చర్యలు
అనుమతి లేనిలేఅవుట్‌ను పరిశీలిస్తున్న పీకేఎం ఉడా వైస్‌చైర్మన, డీఎల్పీవో

జలవనరులను పూడ్చివేస్తున్న వారిని హెచ్చరించిన అధికారులు

మదనపల్లె టౌన, ఆగస్టు 30: ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామ ని పీకేఎం-ఉడా వైస్‌ చైర్మన బాబర్‌, డీఎల్పీవో నాగరాజు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని వలసపల్లె పంచాయతీ పుంగనూరు మార్గంలో జాతీయ రహదారి పక్కన లేఅవుట్‌ వేస్తుం డగా అధికారులు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా పీకేఎం-ఉడా వైస్‌చైర్మన బాబర్‌ మాట్లాడుతూ లేఅవుట్‌లు వేసే వాళ్లు తప్పనిసరిగా రెవెన్యూ కన్వర్షన చార్జీలతో పాటు పంచాయతీకి బెటర్‌మెంట్‌ చార్జీలు, 10శాతం కమ్యునిటీ అవసరాలకు స్థలం వదలాల్సి ఉందన్నారు. అంతే కాకుండా కొందరు వ్యవసాయ భూముల్లో వెళుతున్న వాగులు, వంకలను(జలవనరు లను) పూడ్చి వేసి చదును చేసి ఫ్లాట్లు వేస్తున్నారని దీనిపై మద నపల్లె తహీసీల్దార్‌ ఖాజాభీ దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో పీకేఎం ఉడా అధికారులు కుముదిని, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:50 PM

Advertising
Advertising