ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు: కలెక్టర్‌

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:09 PM

భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు తప్పవని కలెక్టర్‌ అధికారులను హెచ్చరించారు.

క్యూలో నిలబడిన అర్జీదారులు

రాయచోటి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 2: భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు తప్పవని కలెక్టర్‌ అధికారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బాధితులు తరలిరావడంతో ..తమ గోడును చెప్పుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. కలెక్టర్‌ వేదిక పైకి రాగానే ఒక ్కసారిగా అందరూ ఎగబడడంతో, వారిని అదుపు చేసేందుకు సిబ్బంది తల ప్రాణం తోకకు వచ్చినట్లు అయింది. అప్పటికే డీఅర్‌ఓ, ఎ్‌సడీసీ వినతులు తీసుకునేందుకు సిద్ధంగా వున్నా , అర్జీదారులు కలెక్టర్‌కు మాత్రమే అర్జీలు ఇస్తామని మొండికేశారు. గతంలో ఇచ్చిన అర్జీలకు ఇంతవరకు సమాధానం లేదంటూ కొందరు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. చిన్నబిడ్డ తల్లులు కూ డా గంటల తరబడి క్యూలో నిలబడి తమ అర్జిని కలెక్టర్‌కే ఇవ్వాలని ఎదురుచూశారు. అర్జీదారుల బాధలు విన్న కలెక్టర్‌ మండలాలలో అధికారులు తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు మళ్లీమళ్లీ రావడం చూసిన కలెక్టర్‌ కింది స్థాయి సిబ్బందికి చురకలంటించారు. గతంలో జరిగిన అవినీతి, భూ అక్రమాలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు. సోమవారం అందిన ఫిర్యాదుల్లో 80 శాతం భూ సమస్యలేనని అధికారులు తెలిపారు. మదనపల్లి సబ్‌డివిజననుంచి ఎక్కుగా ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - Sep 02 , 2024 | 11:09 PM

Advertising
Advertising