ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంబేడ్కర్‌ గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తాం

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:59 PM

అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

విద్యార్థినుల సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

సంబేపల్లె, సెప్టెంబరు 3: అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం దేవపట్ల బాలయోగి బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించాలని, మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని ఈ సందర్భంగా విద్యార్థినులు మంత్రికి తెలిపారు. విద్యార్థినుల సౌకర్యార్థం జనరేటర్‌ అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

లక్కిరెడ్డిపల్లె సంఘటన పునరావృత్తం కాకూడదు

లక్కిరెడ్డిపల్లె అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో సోమవారం జరిగిన సంఘటన ఎక్కడా పునరావృత్తం కాకూడదని మంత్రి పాఠశాల సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లె సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమె భర్తపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు తెలిపారు. ఏదో ఒకచోట జరిగిన తప్పుతో వ్యవస్థలను నిందించడం తగదన్నారు. అన్నిచోట్లా మంచి వారు కూడా ఉంటారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం ఈ గురుకులాలను స్థాపించినట్లు తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దేవపట్ల గురుకుల పాఠశాలలో డార్మెటరీ నిర్మాణంలో జాప్యం జరగడంతో ఇప్పటి వరకు పని జరిగిన దానికి బిల్లులు చెల్లించి కొత్తవారికి కాంట్రాక్ట్‌ ఇచ్చేలా చూస్తామన్నారు. ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యార్థినుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శశికళ, మాజీ జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, నాయకులు గాజుల ఖాదర్‌బాష, విష్ణువర్ధన్‌రెడ్డి, బయ్యారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కుంచపు రెడ్డెయ్య, ఖాదర్‌హుసేన్‌, అల్లాంషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:59 PM

Advertising
Advertising