ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ కాలనీలో అన్నీ సమస్యలే..

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:41 PM

సమ స్యలకు నిలయం.. జగనన్న కాలనీ. ఇక్కడ నివా సాలు ఏర్పాటు చేసుకోవాలన్న కనీస సౌకర్యాలైన రోడ్డులేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

జగనన్న కాలనీలో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాలు

కనీసం కాలువలు, రోడ్లకు నోచుకోని జగనన్న కాలనీ అవస్థలు పడుతున్న లబ్ధిదారులు

వాల్మీకిపురం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సమ స్యలకు నిలయం.. జగనన్న కాలనీ. ఇక్కడ నివా సాలు ఏర్పాటు చేసుకోవాలన్న కనీస సౌకర్యాలైన రోడ్డులేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. వాల్మీకిపురం పట్టణంలో 2020లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా మంజూరు చేసిన వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీ నేటికీ పూర్తి సౌకర్యాలు కరువై కాలనీ వాసులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. రూ.12కోట్ల వ్యయంతో తొలుతగా 395మందికి ఆపై మరికొద్ది మందికి ఇళ్లు మంజూరయ్యాయి. ఇక అప్పటి నుంచి కొద్దిమంది లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు పూర్తి చేసి కాపురాలు కూడా చేరిపోయారు. అయితే కాలనీ వాసులకు కరెంట్‌ సౌకర్యం, తాగునీటి కుళాయిలు ఇచ్చారే తప్ప పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పన లేదని స్థానికులు వాపోతున్నారు. కాలనీ ప్రాంతం లో సంవత్సరాలు గడుస్తున్నా సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టక పోవడంతో ఇబ్బందు లు తప్పడం లేదంటున్నారు. గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చినపుడు సమ స్యలను విన్నవిస్తే అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తాం.. అంటూ హామీలు ఇచ్చి వెళ్లారే తప్ప సమస్యలు పరిష్కారం కాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాసాలకు కాలువలు లేక సొం తంగా గుంతలు ఏర్పాటు చేసుకున్నామని, కాలనీ వాసులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ప్రాంతంలో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోవ డం గమనార్హం. జగనన్న కాలనీ మంజూరు చేసి న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం భారంగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తికాక లబ్ధిదారులు అర్దాంతరంగా నిలిపివేశారు. ఇసుక స్టీలు, సిమెం ట్‌ ధరలు నిరుపేదలకు భారంగా మారాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అంబే డ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల సమీపాన నిర్మించిన జగనన్న కాలనీ మంజూరు చేసి నా లుగేళ్లు పూర్తి కావస్తున్నా సౌకర్యాల కల్పన మా త్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం గా మిగిలిపోయింది. ఇప్పటికైనా కాలనీ ప్రాం తంలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజలకు పూర్తి వసతులు కల్పిస్తాం

జగనన్న కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖల ద్వారా గతంలోనే ప్రతిపాదనలు పం పించడం జరిగింది. ప్రస్తుతం కాలనీ సమస్యలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమ స్యలను పరిష్కరించడంతో పాటుగా ప్రజలకు పూర్తి స్థాయి వసతుల కల్పన దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

- మనోహరరాజు, ఎంపీడీవో, వాల్మీకిపురం

Updated Date - Nov 09 , 2024 | 11:41 PM