ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్వాడీలకు యాప్‌ కష్టాలు

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:13 AM

అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌లతో సతమతవుతు న్నారు.

లబ్ధిదారుల ముఖ హాజరుతో తిప్పలు

మారుమూల ప్రాంతాల్లో నెట్‌ వర్క్‌ కష్టాలు

ఓ వైపు రికార్డులు, మరో వైపు

సమావేశాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న వైనం

పెద్దతిప్పసముద్రం నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి) : అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌లతో సతమతవుతు న్నారు. లబ్ధిదారులకు పోషణ ట్రాకర్‌, బాల సం జీవిని అందించాలంటే నాలుగు యాప్‌లు నిర్వ హించాలి. ఇందుకు ముఖ హాజరు నమోదు చే యాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బాలసంజీవిని ద్వారా లబ్ధిదారులకు ముఖ గుర్తింపుతో బియ్యం ఇస్తున్నా రు. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ ట్రాకర్‌ ద్వారా యాఫ్‌లో లబ్ధిదారులకు ముఖ గుర్తింపు ద్వారానే ఇవ్వాలనే నిబందనను తప్పని సరి చేయడంతో కార్యకర్తలు రెండు యాప్‌లు నిర్వహించాలంటే కష్టతరంగా మారిందని వాపోతున్నారు. కనీసం అంగన్వాడీ కార్యకర్తలకు యాప్‌లపై అనుభవం ఉన్న వారిచే శిక్షణ ఇప్పిస్తే కొంచమైనా అనుభవం వస్తుందం టున్నారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు 6 నెలల నుంచి 3 సంవత్సరాల బాలలకు ఆయా కేంద్రాల్లో ప్రతి నెల పోషకాహారాన్ని లబ్ధిదారుల ఇంటికే అందించ డం జరుగుతుంది. గతంలో లబ్ధిదారులకు అంగ న్వాడీ కేంద్రాల వద్దనే ఇచ్చేవారు. అయితే ఎక్కువ మంది తమకు ఇంటి వద్దకే కావాలంటూ ప్రభు త్వానికి అభ్యర్థనలు రావడంతో దాన్ని టీహెచఆర్‌ (టేక్‌ హోమ్‌ రేషన)గా మార్చి పాలు, కోడి గు డ్లు, నూనె, పప్పుదినుసులు, బియ్యం వంటివి ప్ర తి నెలా రెండు దఫాలుగా అందిస్తున్నారు. బి.కొత్తకోట సెక్టార్‌ పరిధిలోని బి.కొత్తకోట, పెద్దతి ప్పసముద్రం, కందుకూరు, ములకలచెరువు మం డలాల్లో 165 మెయిన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ఇందులో 56 మినీ ఉపకేంద్రాలు ఉన్నాయి. కాగా ప్రీ స్కూల్‌ పిల్లలు 1889 మంది ఉండగా గర్భిణులు, బాలింతలు 1455 మంది 6నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు4128 మం ది ఉన్నారు. వారందరికి ప్రతి నెల వివరాలు యాప్‌లో నమోదు చేయాల్సి రావడంతో పూర్వ ప్రాథమిక విద్యకు ఇబ్బందిగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు సార్లు నమోదు కష్టంగా మారింది

ఆయా కేంద్రాల్లో ఉన్న గర్భిణిలు, బాలింతలు 6 నెలల నుంచి 3 సంవత్సరాలు కలిగిన చిన్నారుల పూర్తి వివరాలను పోషణ యాప్‌ ద్వారా రెండు సార్లు నమోదు చేయాల్సి వస్తోందంటున్నారు. అదే విధంగా టీహెచఆర్‌ (టేక్‌ హోమ్‌ రేషన ) అందించాలంటే ఒకే వ్యక్తికి తప్పకుండా రెండు సార్లు ముఖ యాప్‌ ద్వారా అంగన్వాడీ కార్యకర్తల కు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

ప్రాథమిక విద్యకు ఇబ్బందులు

అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 15 రకా ల రికార్డులను నమోదు చేయాల్సి ఉందని దీంతో ప్రాథమిక విద్యకు ఇబ్బందులు కలుగుతున్నాయని అంగన్వాడీలు వాపోతున్నారు. ఇంఉదలో లబ్ధిదా రులకు అందించే ఆహారం వినియోగం (ఎఫ్‌సీ ఆర్‌), పిల్లలు, గర్భిణులు,బాలింతలకు నమోదు చేసే రికార్డులు (ఎస్‌.ఎన.టి), ప్రీ స్కూల్‌ అడ్మీన రికార్డులను ప్రతి నిత్యం విధిగా నమోదు చేయా ల్సి ఉంటుంది. వాటితో పాటుగా పిల్లలకు అం దించే టీకాలకు సంబందించిన రికార్డుల రిజిస్టర్‌, విటమిన-ఏ రికార్డు, రెఫరల్‌ సర్వీసెస్‌ గృహ సం దర్శకుల రికార్డులను చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నెలవారీ ప్రాజెక్టు (ఎంటీఆర్‌), ఆయా అంగనవాడీల పరిధిలోని హోస్‌ హోల్డ్‌ సర్వే, గ్రోత రికార్డు, గ్రోత చార్ట్‌లతో పాటుగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంబందిం చిన రెండు టేక్‌ హోమ్‌ రేషనల రికార్డు, స్టాప్‌ అడ్మిన రిజిస్టర్‌ నిర్వహించాల్సి వస్తోందంటున్నారు.

నెట్‌ వర్క్‌ రాని ప్రాంతాల్లో మరీ ఇబ్బంది

మండలంలోని మారుమూల ప్రాంతాలైన టి.స దుం పంచాయతీ గుంటిపల్లె, నవాబుకోట పంచా యతీ గుగ్గిళ్లపలె,్ల, బెట్టకొండ, కందుకూరు పంచా యతీ గొల్లపల్లె , గొడుగువారిపల్లె, నిలువు రాతిప ల్లె పంచాయతీల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో నెట్‌ వర్క్‌ కష్టాలు అధికంగా ఉండడంతో కార్యకర్తలు సమీపంలో గల సచివాలయాల వద్దకు వెళ్లి వైఫే ద్వారా కనెక్ట్‌ చేసుకుని మరీ లబ్ధిదారుల నమోదు చేస్తున్నారు.

యాప్‌ల భారం తగ్గించాలి

అంగన్వాడీలకు ప్రభుత్వం స్పందించి యాప్‌ల భారం తగ్గించాలని పలువురు కోరుతున్నారు. ఆయా గ్రామాల్లోని క్షేత్ర స్థాయిలో ఏ కార్యక్రమా లను ప్రభుత్వం తల పెట్టినా మొదటగా అంగ న్వాడీ కార్యకర్తలను భాగస్వాములను చేస్తున్నార ని వాపోతున్నారు. తల్లి గర్భం దాల్చిన సమయం నుండి బిడ్డ పుట్టి ఆరేళ్లు వయస్సు వచ్చే వరకు అంగన్వాడీ కార్యకర్తలే వారిని నిత్యం పర్యవేక్షిం చాల్సి వస్తోందన్నారు. తల్లికి, బిడ్డకు పోషణతో పాటు బిడ్డలకు టీకాలు, వారి ఆరోగ్య కార్డులు తదితర వివరాలను నిత్యం అంగన్వాడీ కార్యకర్తలే నిత్యం యాప్‌ల ద్వారానే నిర్వహించాల్సి వస్తోం దని వాపోతున్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:13 AM