ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి నిందితుల అరెస్టు

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:22 PM

స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద నాగలకట్ట వెళ్లే దారిలో 27వ తేదీ సాయంత్రం గంజాయి నిందితులను అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు అర్బన్‌ సీఐ లింగప్ప తెలిపారు.

గంజాయి సహా నిందితులతో సీఐ లింగప్ప, ఎస్‌ఐలు

3050 గ్రాములు గంజాయి స్వాధీనం : అర్బన్‌ సీఐ లింగప్ప

జమ్మలమడుగు, ఆగస్టు 28: స్థానిక రైల్వేస్టేషన్‌ వద్ద నాగలకట్ట వెళ్లే దారిలో 27వ తేదీ సాయంత్రం గంజాయి నిందితులను అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు అర్బన్‌ సీఐ లింగప్ప తెలిపారు. బుధవారం సాయంత్రం జమ్మలమడుగు అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో విలేకరులకు ఆయన నిందితుల వివరాలు వెల్లడిస్తూ అంది న సమాచారం మేరకు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఉత్తర్వుల మేరకు సిబ్బంది వెళ్లి దాడి చేశారన్నారు. పట్టుబడినవారిలో నిందితులు నెల్లూరుజిల్లా ఉదయగిరి వాసి యాదగిరి వంశీకృష్ణ, ప్రొద్దుటూరులోని మత్స్యకాలనీ వాసి గొర్రె స్వర్ణేంద్రకుమార్‌, బొల్లవరం వీధికి చెందిన గాదెగూడూరు కల్యాణ్‌, హనుమాన్‌నగర్‌ వాసి వద్ది సాయిప్రసాద్‌, చౌడం వెంకటేష్‌, సానిక కోటవీధి వాసి ఆవుల అరవింద్‌, ధ్యానసుమంత్‌ టీకేఆర్‌ స్కూల్‌ వీధి, మరో ముగ్గురు బాలురు పట్టుబడినట్లు తెలిపారు. వారి నుంచి 3కిలోల 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నింది తులు కొంత కాలంగా గంజాయికి బానిసై కిలో రూ.12 వేలకు కొనుగోలు చేసి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లోని కల్యాణ్‌, స్వర్ణేంద్రకుమార్‌, సాయిప్రసాద్‌, వెంకటేష్‌కు విక్రయించేవారన్నారు. గంజాయిని అరవింద్‌, సుమంత్‌, మరో ముగ్గురు బాలురు కలిసి రూ.16 వేలకు విక్రయించేవారని విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టు రిమాండ్‌కు ఆదేశించిందని సీఐ తెలిపారు.

Updated Date - Aug 28 , 2024 | 11:23 PM

Advertising
Advertising